...
...
Next Story

రక్తంతో తడిచిపోయిన రష్మిక మందన్న.. మైసా ఫస్ట్ గ్లింప్స్.. విజయ్ దేవరకొండ మూవీలాగే ఉందంటున్న ఫ్యాన్స్..

రష్మిక మందన్న లీడ్ రోల్లో నటిస్తున్న మైసా మూవీ ఫస్ట్ గ్లింప్స్ వీడియో బుధవారం (డిసెంబర్ 24) రిలీజైంది. ఇందులో రక్తంలో తడిచిపోయిన రష్మిక లుక్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దనలాగే ఉందని కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేయడం విశేషం.

Published on: Dec 24, 2025, 13:54:45 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పటివరకు చూడని వైల్డ్ లుక్‌లో దర్శనమిచ్చింది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఆమె నటిస్తున్న 'మైసా' (Mysaa) ఫస్ట్ గ్లింప్స్ బుధవారం (డిసెంబర్ 24) విడుదలైంది. రష్మిక గ్యాంగ్‌స్టర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన', రష్మిక 'మైసా' కలిస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుకుంటున్నారు.

రష్మిక మైసా లుక్

రక్తంలో తడిచిపోయిన రష్మిక మందన్న.. మైసా ఫస్ట్ గ్లింప్స్.. విజయ్ దేవరకొండ మూవీలాగే ఉందంటున్న ఫ్యాన్స్..
రక్తంలో తడిచిపోయిన రష్మిక మందన్న.. మైసా ఫస్ట్ గ్లింప్స్.. విజయ్ దేవరకొండ మూవీలాగే ఉందంటున్న ఫ్యాన్స్..

సాధారణంగా క్లాస్, గ్లామర్ పాత్రల్లో కనిపించే రష్మిక మందన్న ఈసారి రూటు మార్చింది. చేతిలో రైఫిల్, ఒంటి నిండా రక్తం, కళ్ళలో కసి.. వెరసి 'మైసా' గ్లింప్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఒక నిమిషం 21 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్‌లో రష్మిక కుర్తా-పైజామా ధరించి, గాయాలతో కనిపిస్తుంది.

దెబ్బలు తగిలి కింద పడిపోతున్నా, కుంటుతున్నా సరే.. చేతిలోని రైఫిల్ మాత్రం వదలదు. చివర్లో ఆమె వేసే కేక గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇందులో రష్మిక ఒక గోండు మహిళగా కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఈశ్వరీ రావు (రష్మిక తల్లి పాత్రలో) చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్‌కి ప్రాణం పోశాయి. "నా కూతురు చనిపోయిందని చెప్పారు. కానీ నా బిడ్డ రక్తాన్ని దాచలేక భూమి భయంతో కంపించింది.. నా బిడ్డ ఊపిరిని మోయలేక గాలి స్తంభించింది.. నా బిడ్డ ఆగ్రహాన్ని చూసి అగ్ని కూడా బూడిదైంది.. చివరకు నా బిడ్డను చంపలేక ఆ మృత్యువే చనిపోయింది. నా బిడ్డ ఎవరో తెలుసా?" అంటూ సాగే వాయిస్ ఓవర్ అద్భుతంగా ఉంది.

రష్మిక ఏమన్నదంటే?

ఈ ఏడాది 'ది గర్ల్ ఫ్రెండ్'లో సాఫ్ట్ రోల్ చేసిన రష్మిక.. ఇప్పుడు బీస్ట్ మోడ్‌లో కనిపించడం చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండతో లింక్ పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన' (Rowdy Janardhana) లుక్ (లుంగీ కట్టుకుని మాస్ అవతార్) వైరల్ అయ్యింది. ఇప్పుడు రష్మిక కూడా అదే రేంజ్ మాస్ లుక్‌లో ఉండటంతో.. "హజ్బెండ్ అండ్ వైఫీ పవర్ కపుల్ ఎనర్జీ చూపిస్తున్నారు" అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిస్తే ఆ సినిమా వేరే లెవెల్ ఉంటుందని ఆశిస్తున్నారు.

మైసా సినిమా విశేషాలు

మైసా మూవీని రవీంద్ర పుల్లె డైరెక్ట్ చేస్తున్నాడు. అతనికిదే తొలి సినిమా. ఇందులో రష్మికతోపాటు ఈశ్వరీ రావు, రావు రమేష్, గురు సోమసుందరం ప్రధాన పాత్రల్లో నటించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించాడు. అతని బీజీఎం ఈ గ్లింప్స్ వీడియోను ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రస్తుతం తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో షూటింగ్ జరుగుతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks