...
...
Next Story

నాకు అందుకే షోస్‌కి వెళ్లాలంటే భయం.. నేను ఒకటి చెబితే ఇంకోలా అర్థం చేసుకుంటారు: రష్మిక మందన్న కామెంట్స్

రష్మిక మందన్న తాను షోలకు, ఇంటర్వ్యూలకు ఎందుకు వెళ్లనో చెప్పింది. వాటిలో తాను చెప్పేది ఒకటి.. అందరూ అర్థం చేసుకునేది మరొకటని ఆమె ట్వీట్ చేసింది. ఈ మధ్యే ఆమె జగపతి బాబు షోకి వెళ్లిన విషయం తెలిసిందే.

Published on: Nov 12, 2025, 19:40:01 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

రష్మిక మందన్న ఈమధ్య ఒక టెలివిజన్ టాక్ షోలో పీరియడ్స్‌కు సంబంధించి చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి దారితీశాయి. పురుషులు కూడా ఆ బాధను అనుభవించాలని ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ.. షోలకు వెళ్లడానికి తనకు భయం వేస్తుందని వ్యాఖ్యానించింది.

"పీరియడ్స్ బాధ అనుభవించాలని అన్నాను, కానీ..."

నాకు అందుకే షోస్‌కి వెళ్లాలంటే భయం.. నేను ఒకటి చెబితే ఇంకోలా అర్థం చేసుకుంటారు: రష్మిక మందన్న కామెంట్స్
నాకు అందుకే షోస్‌కి వెళ్లాలంటే భయం.. నేను ఒకటి చెబితే ఇంకోలా అర్థం చేసుకుంటారు: రష్మిక మందన్న కామెంట్స్

నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ5 టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’లో రష్మిక మందన్న మాట్లాడింది. మహిళలు ప్రతి నెలా అనుభవించే పీరియడ్స్ నొప్పిని పురుషులు కూడా అనుభవించాలని ఆమె కామెంట్ చేసింది. ఈ కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం సృష్టించింది. పురుషులు కూడా సమాజంలో పడే కష్టాల గురించి పోల్చుతూ నెటిజన్లు రష్మికను విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలో.. తాను షోలకు వెళ్లడానికి భయపడుతున్నానని నటి సోషల్ మీడియాలో తెలిపింది.

షోలకు వెళ్లాలంటే భయం వేస్తోంది: రష్మిక

తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో.. రష్మికకు మద్దతిచ్చే ఒక అభిమాని ఆమె క్లిప్‌ను ఎక్స్ లో షేర్ చేసి.. ఆమె చెప్పదలచుకున్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఈ పోస్ట్‌కు రష్మిక స్పందిస్తూ.. తన మాటలను చాలా తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్పింది.

"దీని గురించి ఎవరూ మాట్లాడరు.. షోలు, ఇంటర్వ్యూలకు వెళ్లడానికి నాకు భయం వేయడానికి ఇదే కారణం. నేను ఒక ఉద్దేశంతో ఏదైనా చెబితే, అది పూర్తిగా వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు.." అని రష్మిక ట్వీట్ చేసింది. అనేక మంది అభిమానులు ఆమెకు మద్దతుగా కామెంట్ చేశారు. ఆమె కామెంట్స్ ను సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలని అన్నారు.

పీరియడ్స్ గురించి రష్మిక ఏమన్నదంటే?

తన సొంత అనుభవాన్ని పంచుకుంటూ రష్మిక ఇలా చెప్పింది. “నాకు భయంకరమైన పీరియడ్ నొప్పి వస్తుంది. దానితో నేను ఒక్కసారి స్పృహ తప్పి పడిపోయాను కూడా. నేను అనేక పరీక్షలు చేయించుకున్నాను. వైద్యులను సంప్రదించాను. కానీ అది ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు.

ప్రతి నెలా నేను దేవుడా.. నన్ను ఎందుకు ఇంతలా హింసిస్తున్నావు అని అనుకుంటాను. ఎవరైనా దాన్ని అనుభవించినప్పుడే అర్థం చేసుకోగలరని నేను భావిస్తున్నాను. అందుకే పురుషులకు కనీసం ఒక్కసారైనా పీరియడ్స్ రావాలని నేను అనుకుంటున్నాను” అని రష్మిక అన్నది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe