Rashmika Mandanna: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. ఈ మధ్యే పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' (Koffee With Karan 9)లో సందడి చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో తమ పెళ్లి, ప్రపోజల్ గురించి సరదాగా పంచుకున్న కొన్ని విషయాలను కొంతమంది నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని విజయ్‌పై విమర్శల వర్షం కురిపించడం ప్రారంభించారు.

తన భర్తపై వస్తున్న వరుస ఆరోపణలు, హద్దులు దాటుతున్న విమర్శలపై రష్మిక మందన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారానికి చెక్ పెడుతూ ఒక సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు. "నేను నా భర్తను పిచ్చిగా ప్రేమిస్తున్నాను, అందులో తప్పేముంది? మా ఇద్దరి బంధం ఏంటో మాకు తెలుసు" అని స్పష్టం చేస్తూ ట్రోలర్ల నోళ్లు మూయించారు.
"ఆ పిచ్చి నాకుంది.. అందులో తప్పేముంది?"
తమ బంధంపై, తాను విజయ్‌పై చూపిస్తున్న ప్రేమపై వ్యాఖ్యలు చేస్తున్న వారికి రష్మిక ఘాటుగానే సమాధానమిచ్చారు. "అవును.. నేను నా భర్త విషయంలో పిచ్చిగా ఉన్నాను. ఒక భార్య తన భర్తను అంతగా ప్రేమించడం ఎప్పటినుంచి తప్పు అయిపోయింది?" అని నేరుగా ప్రశ్నించారు.
"నేను ఎవరినైతే పెళ్లి చేసుకున్నానో ఆ వ్యక్తిని ప్రేమించకపోతే, అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? నా జీవితంలో ఎదురయ్యే గడ్డు రోజులు, అద్బుతమైన రోజులను కలిసి పంచుకోవడానికి, ఆయనతో కలిసి పిల్లలను పెంచడానికి, జీవితాంతం గడపడానికి నేను విజయ్‌నే కోరుకున్నాను. వంద సార్లుకాడు వెయ్యిసార్లు అయినా సరే ఆయనకు నేను ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని రష్మిక తన ప్రేమను స్పష్టం చేశారు.
పెళ్లి విషయంలో విజయ్ ఆలోచన సరైనదే
ఇంటర్వ్యూలో విజయ్ పెళ్లికి ఏడాది సమయం తీసుకున్నారని చెప్పిన విషయాన్ని ట్రోలర్లు టార్గెట్ చేయడంపై రష్మిక క్లారిటీ ఇచ్చారు.
{{/usCountry}}ఇంటర్వ్యూలో విజయ్ పెళ్లికి ఏడాది సమయం తీసుకున్నారని చెప్పిన విషయాన్ని ట్రోలర్లు టార్గెట్ చేయడంపై రష్మిక క్లారిటీ ఇచ్చారు.
{{/usCountry}}"నేను మనసు చెప్పినట్లు వినే వ్యక్తిని, విజయ్ పక్కా ప్రాక్టికల్‌గా ఆలోచించే వ్యక్తి. జీవితంలో వచ్చే హెచ్చుతగ్గులను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడంలో తప్పేమీ లేదు. మా ఇద్దరి భిన్నమైన ఆలోచనా విధానాలే మమ్మల్ని ఒక పర్ఫెక్ట్ జంటగా మార్చాయి. మోకాలిపై కూర్చొని చేసే గ్రాండ్ ప్రపోజల్స్, రింగ్‌ల కంటే కలిసి నిర్మించుకునే జీవితమే మాకు ముఖ్యం. అందుకే మేం ఒకరినొకరు ఎంచుకున్నాం" అని తెలిపారు.
కష్టాల్లో ఉన్నప్పుడు విజయ్ మాత్రమే ఉన్నాడు
సోషల్ మీడియాలో 'మీ మంచి కోరి చెప్తున్నాం' అని సలహాలు ఇచ్చే వారికి రష్మిక ఒక చేదు నిజాన్ని గుర్తుచేశారు.
"నేను తీవ్రమైన మానసిక ఆందోళనతో రాత్రిళ్ళు నిద్రలేచినప్పుడు, నొప్పితో బాధపడినప్పుడు లేదా నా కెరీర్లో కష్ట కాలంలో ఉన్నప్పుడు ఈ నెటిజన్లు ఎవరూ అక్కడ లేరు.. విజయ్ మాత్రమే నా పక్కన ఉన్నాడు. ఇంటర్నెట్లో కట్ చేసిన వీడియోలు, తప్పుడు ప్రచారాలను నమ్మే బదులు, నా జీవితం గురించి నేను చెప్పేది నమ్మకపోవడం విడ్డూరంగా ఉంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫెమినిజం పేరుతో తిట్టడం.. కుటుంబాలను లాగొద్దు
తమ కుటుంబాలను కూడా ఈ వివాదంలోకి లాగుతున్న వారిపై రష్మిక మండిపడ్డారు. "నా గురించి ఏం మాట్లాడినా నేను భరిస్తాను. కానీ నా కుటుంబం గురించి తెలియకుండా మాట్లాడితే సహించేది లేదు. ఫెమినిజం అంటే ఒక మహిళ తీసుకున్న నిర్ణయాలను గౌరవించడం, అంతే తప్ప ఫెమినిజం పేరుతో ఒకరిపై వేధింపులకు దిగడం కాదు" అని గట్టిగా హితవు పలికారు.
చివరగా, గత 10 సంవత్సరాలుగా తనకు మద్దతుగా నిలుస్తున్న కన్నడ అభిమానులకు, తనను ప్రేమించే ప్రేక్షకులకు రష్మిక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తాను తన జీవితంలో అత్యంత సంతోషకరమైన, సంతృప్తికరమైన స్థితిలో ఉన్నానని స్పష్టం చేస్తూ ఈ వివాదానికి ముగింపు పలికారు.
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాలతో వెండితెరపై మెప్పించిన ఈ జంట.. ఇటీవల 'రణబాలి' చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే.