...
...
Next Story

Rashmika Mandanna: ఆ రోజు విజ్జూ కూడా నా టీమే.. హ‌ల్దీ ఫొటోలు షేర్ చేసిన ర‌ష్మిక మంద‌న్న‌.. ఇది ఆరంభం మాత్ర‌మే అంటూ

Rashmika Mandanna: విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్న రష్మిక మందన్న ఫుల్ హ్యాపీగా ఉంది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూనే ఉంది. తాజాగా తమ హల్దీ ఫొటోలను ఈ నేషనల్ క్రష్ షేర్ చేసింది.

Published on: Mar 17, 2026, 05:39:43 IST
Advertisement

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వెడ్డింగ్ నేషనల్ లెవల్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో ఈ విరోష్ జంట పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ వీళ్ల వివాహం ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. తాజాగా రష్మిక మందన్న తమ హల్దీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

విరోష్ హల్దీ

హల్దీ ఫంక్షన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
హల్దీ ఫంక్షన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. అంతకంటే ముందు మెహందీ, హల్దీ, సంగీత్ లాంటి ప్రి వెడ్డింగ్ కార్యక్రమాలు జరిగాయి. తాజాగా తమ హల్దీకి సంబంధించిన ఫొటోలను రష్మిక మందన్న పంచుకుంది. ఇందులో విజయ్, రష్మిక నవ్వుతూ చాలా హ్యాపీగా కనిపించారు.

విజ్జూ నా టీమ్

‘‘హల్దీ. అది హల్దీ ప్లస్ హోలీలా సాగింది. మేం రంగులలో బాగా తడిసి ముద్దయ్యాము, ఇప్పటికీ నా జుట్టులో కొద్దిగా ఎరుపు రంగు ఉంది. ఆ రోజు నా టీమ్ బ్రైడ్ అద్భుతమైన సాయంతో అన్ని గేమ్స్ నేనే గెలిచా. విజ్జూ (విజయ్ దేవరకొండ) కూడా ఆ రోజు నా టీమే’’ అని రష్మిక హల్దీ ఫొటోలను పోస్టు చేసింది.

ఆ వైబ్

చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్నారు. తెలుగు, కొడవ సంప్రదాయాల్లో వీళ్ల పెళ్లి జరిగింది. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించారు. దీనికి రాజకీయ, సినీ ప్రముఖులు అటెండ్ అయ్యారు.

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి కలిసి ‘రణబాలి’ మూవీ చేస్తున్నారు. ఇది పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks