థామా బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 2: మాడాక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో వచ్చిన లేటెస్ట్హారర్ కామెడీ థామా బాక్సాఫీస్ దగ్గర నిలకడగా సాగుతోంది. బాక్సాఫీస్ రన్నింగ్ కొనసాగిస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన ఈ మూవీ రెండో రోజు కలెక్షన్లను కాస్త తగ్గాయి. వర్కింగ్ డే కావడం ప్రభావం చూపింది. దీపావళి సందర్భంగా థామా అక్టోబర్ 21న రిలీజైంది.
పాజిటివ్ టాక్

రష్మిక మందన్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ థామాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఇందులోని కామెడీ, హారర్, రొమాన్స్ సరిగ్గా కుదిరాయనే కామెంట్లు వస్తున్నాయి. ఓపెనింగ్ రోజైన మంగళవారం (అక్టోబర్ 21) ఈ మూవీ ఇండియాలో రూ.25.11 కోట్లతో మంచి ఓపెనింగ్ దక్కించుకుంది. అయితే బుధవారం వర్కింగ్ డే కావడంతో వసూళ్లు కాస్త తగ్గాయి.
థామా కలెక్షన్లు
మంగళవారం ఇండియాలో థామా సినిమా రూ.25 కోట్లకు పైగా వసూలు చేసింది. మొదటి రోజు సినిమాకు రూ.25.11 కోట్లు వచ్చాయని మాడాక్ ఫిల్మ్స్ తెలిపింది. రెండో రోజున ఈ హారర్ థ్రిల్లర్ రూ.18 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. దీంతో రెండు రోజుల్లో ఈ మూవీ కలెక్షన్లు రూ.43 కోట్లకు చేరుకున్నాయి. ఈ చిత్రం రెండో రోజు గణనీయమైన తగ్గింపును చూసింది. ఎందుకంటే మార్నింగ్ షోలు కేవలం 10% ఆక్యుపెన్సీని మాత్రమే నమోదు చేశాయి.
వీకెండ్ పై ఆశలు
థామా మూవీ వీకెండ్ పై ఆశలు పెట్టుకుంది. అయితే అంతకంటే ముందు గురువారం, శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఈ మూవీకి అతిపెద్ద పరీక్ష. దీపావళి సెలవుదినం, మంచి సమీక్షలు బాక్సాఫీస్ వద్ద అవసరమైన పుష్ ను ఇచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రం భారీ వీకెండ్ కు రెడీ అయింది.
రూ.100 కోట్లు
వీకెండ్ లో థామా మూవీ కలెక్షన్లలో అదరగొట్టే అవకాశముంది. వీకెండ్ లో ఈ మూవీ వసూళ్లు రూ.100 కోట్ల కంతే తక్కువ వస్తే మాత్రం అది పూర్తిగా నిరాశపర్చినట్లేనని వాణిజ్య పండితులు అంటున్నారు.
{{/usCountry}}వీకెండ్ లో థామా మూవీ కలెక్షన్లలో అదరగొట్టే అవకాశముంది. వీకెండ్ లో ఈ మూవీ వసూళ్లు రూ.100 కోట్ల కంతే తక్కువ వస్తే మాత్రం అది పూర్తిగా నిరాశపర్చినట్లేనని వాణిజ్య పండితులు అంటున్నారు.
{{/usCountry}}మాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా థామా సినిమాను తీసుకొచ్చారు. ఇందులో గతంలో స్త్రీ ఫ్రాంఛైజీ, భేడియా, ముంజ్య చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు థామా ఇందులో చేరింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్, రష్మిక, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం చాలా వరకు సానుకూల సమీక్షలను అందుకుంది.