Horror Thriller Series: మరికొన్ని గంటల్లోనే ఆహా ఓటీటీలోకి రష్మి గౌతమ్ హారర్ ఆంథాలజీ సిరీస్.. ఆ డార్క్ రూమ్ లో ఏముంది?

Horror Thriller Series: జబర్దస్ట్ యాంకర్ గా తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న రష్మి గౌతమ్ మరోసారి భయపెట్టేందుకు వచ్చేస్తోంది. ఆమె కీలక పాత్ర పోషించిన హారర్ థ్రిల్లర్ ఆంథాలజీ సిరీస్ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. ఆ సిరీస్ పూర్తి వివరాలు చూసేయండి. 

Published on: Nov 26, 2026, 13:50:59 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Horror Thriller Series: హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకుల కోసం మరికొన్ని గంటల్లోనే కొత్త వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతుంది. రేపటి నుంచి అంటే ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ఆహా ఓటీటీలో హారర్ థ్రిల్లర్ ఆంథాలజీ వెబ్ సిరీస్ ‘రాతిరి’ స్ట్రీమింగ్ కానుంది.

మరికొన్ని గంటల్లోనే ఆహా ఓటీటీలోకి రష్మి గౌతమ్ హారర్ ఆంథాలజీ సిరీస్.. ఆ డార్క్ రూమ్ లో ఏముంది?
మరికొన్ని గంటల్లోనే ఆహా ఓటీటీలోకి రష్మి గౌతమ్ హారర్ ఆంథాలజీ సిరీస్.. ఆ డార్క్ రూమ్ లో ఏముంది?

రాతిరి వెబ్ సిరీస్

పాపులర్ ఓటీటీ వేదిక 'ఆహా' తన ఒరిజినల్ హారర్ అంథాలజీ వెబ్ సిరీస్ 'రాతిరి'ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ యాంకర్, నటి రష్మి గౌతమ్, తమిళ నటుడు నట్టి, దివ్య గణేశన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. 'రాతిరి' సిరీస్ నవంబర్ 27 శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.

థ్రిల్ తో భయపెట్టేలా

ఎం. కంపెనీ బ్యానర్‌పై ఈ హారర్ అంథాలజీ రాతిరి వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఇటీవల 'మా ఊరి పొలిమేర', 'పిండం', 'దహాన్', 'తంత్ర' వంటి హారర్ కథలు ప్రేక్షకులను ఏ స్థాయిలో భయపెట్టాయో, అంతకుమించిన థ్రిల్ అందించేలా 'రాతిరి' ఉంటుందని మేకర్స్ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రోమోలు, పోస్టర్లు హారర్ ప్రియుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి.

స్టోరీ ఏంటంటే?

'వేర్వేరు ప్రదేశాలు.. వేర్వేరు వ్యక్తులు.. కానీ భయం మాత్రం ఒక్కటే' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ అంథాలజీ సిరీస్ రాతిరిని రూపొందించారు. అంథాలజీ ఫార్మాట్ కావడంతో ఇందులో వేర్వేరు వ్యక్తుల జీవితాల్లో జరిగే భయానక సంఘటనలు, రహస్యాలను భిన్నమైన కథలుగా చూపించనున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఒక ఆసుపత్రి గది, పాత ఇల్లు, నివాస భవనాలు, చీకటి వీధులు, ఆలయం వంటి పరిసరాలను ఎరుపు రంగు భయానక నేపథ్యంతో చూపించారు.

డార్క్ రూమ్ లో

ఇక రీసెంట్ గా వచ్చిన రాతిరి వెబ్ సిరీస్ టీజర్ లో హాస్పిటల్ సీన్ చూపించారు. అందులో ఓ డార్క్ రూమ్ లోకి వెళ్లడానికి నర్స్ భయపడుతుంది. ఈ విజువల్స్ చూస్తుంటే ప్రతి కథలోనూ విభిన్నమైన వాతావరణం, ఊహించని భయానక మలుపులు ఉండబోతున్నాయని అర్థమవుతోంది.

కీలక పాత్రల్లో నట్టి, దివ్య, రష్మి

ఈ హారర్ అంథాలజీలో ప్రతిభావంతులైన నటీనటులు భాగమయ్యారు. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్ల ద్వారా నటుడు నట్టి ఇందులో 'శబరీశన్' పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు నటి దివ్య గణేశన్ 'మంజు' అనే కీలక పాత్రను పోషిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన రష్మి గౌతమ్ కూడా ఈ సిరీస్‌లో ముఖ్యమైన పాత్రలో కనిపించడం తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.