OTT Telugu: టాలీవుడ్‌లో డిఫరెంట్ అండ్ ఇంటెన్స్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రవిబాబు.. కొద్ది వారాల క్రితం ‘రేజర్’ (Razor) అనే రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌తో థియేటర్లలోకి వచ్చాci. అయితే సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగార ప్రభావం చూపించలేకపోయింది. కానీ, ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్స్ పై సంచలనం సృష్టించడానికి సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది.
రేజర్ ఓటీటీ

మొదట రేజర్ మూవీ ప్రాంతీయ ఓటీటీ వేదిక 'ఆహా' లో డిజిటల్ ప్రీమియర్ అయింది. ఇప్పుడు టాలీవుడ్‌లో అరుదుగా జరిగే డ్యూయల్ ప్లాట్‌ఫామ్ స్ట్రాటజీ (రెండు ఓటీటీల్లో ఒకేసారి అందుబాటులో ఉంచడం) ని ఎంచుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోనూ ఈ చిత్రం ప్రత్యక్షమైంది.
ఈ నిర్ణయం వల్ల ఈ వయలెంట్ యాక్షన్ డ్రామా రేజర్ మూవీకి గ్లోబల్ ఆడియన్స్ నుండి భారీ స్థాయిలో వీక్షకులు లభించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
భారీ తారాగణంతో..
రేజర్ చిత్రానికి రవిబాబు దర్శకత్వం వహించడమే కాకుండా తానే స్వయంగా ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. ఆయన మార్క్ మేకింగ్‌తో సాగే ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ నటుడు తనీష్ అల్లాడి, బిగ్‌బాస్ ఫేమ్ ఇనాయా సుల్తానా, బేబీ తేజల్ విద్యాతి, బెనర్జీ, వీరన్న చౌదరి, ప్రముఖ నటుడు రామరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
థియేటర్లో ఫ్లాప్
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రవిబాబు స్వంత బ్యానర్ ‘ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్’, స్టార్ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు సంయుక్తంగా ‘సురేష్ ప్రొడక్షన్స్’ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజేష్ అందించిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా మూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. కానీ థియేటర్లో ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది.
'A' రేటెడ్ డార్క్ క్రైమ్
ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, రా అండ్ రస్టిక్ వయలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చింది. సాధారణ థియేట్రికల్ ఆడియన్స్ కంటే ఓటీటీలో ఇలాంటి రా కంటెంట్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
రవిబాబు మార్క్ థ్రిల్లర్
{{/usCountry}}ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, రా అండ్ రస్టిక్ వయలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చింది. సాధారణ థియేట్రికల్ ఆడియన్స్ కంటే ఓటీటీలో ఇలాంటి రా కంటెంట్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
రవిబాబు మార్క్ థ్రిల్లర్
{{/usCountry}}‘అనసూయ’, ‘అవును’ వంటి సినిమాలతో థ్రిల్లర్ జానర్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న రవిబాబు.. చాలా కాలం తర్వాత తన వింటేజ్ స్టైల్ క్రైమ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించాడు. డార్క్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ ‘రేజర్’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.