మాస్ మహారాజా రవితేజ చాలా రోజుల తర్వాత ఓ పక్కా ఫ్యామిలీ మ్యాన్‌లా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో అతడు అలరించనున్న విషయం తెలిసిందే. మూవీ జనవరి 13న రిలీజ్ కానుండగా.. బుధవారం (జనవరి 7) ట్రైలర్ రిలీజ్ చేశారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్

రవితేజ తన మాస్ మహారాజా పేరుకు తగినట్లే కొన్నాళ్లుగా వరుసగా మాస్ సినిమాలతో వస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాడు. దీంతో ఈసారి రూటు మార్చి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో సంక్రాంతి బరిలో నిలిచాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే వెరైటీ టైటిల్ కు తగినట్లుగానే.. ట్రైలర్ కూడా ఫన్నీగా సాగిపోయింది.
బ్యాక్ టు బ్యాక్ గన్లు, కత్తులు, భోజనాల ఫైట్లు, జాతర ఫైట్లు చేశానని, ఫ్యామిలీ డాక్టర్ కాస్త గ్యాప్ ఇవ్వమన్నాడంటూ ఈ ట్రైలర్ మొదలు పెడతాడు రవితేజ. ఆ తర్వాత అతడు ఫ్యామిలీ మ్యాన్ రూపంలోకి మారిపోతాడు. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే వ్యక్తిగా మెప్పించాడు. ఈ సంక్రాంతికి నవ్వులు గ్యారెంటీ అనేలా ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ట్రైలర్ సాగిపోయింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ విశేషాలు
కిశోర్ తిరుమల ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇందులో రవితేజతోపాటు డింపుల్ హయతి, ఆశికా రంగనాథ్ నటించారు. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజకు ఈ మూవీతోనూ హిట్టు కొట్టడం అంత సులువుగా కనిపించడం లేదు.
ఎందుకంటే ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారీలాంటి సినిమాల నుంచి దీనికి గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రేక్షకులు మెచ్చే ఏదైనా యూనిక్ పాయింట్ ఉంటే తప్ప బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడం కష్టం. తన మాస్ రూటును పక్కన పెట్టి హిట్టు కోసం ఫ్యామిలీ బాట పట్టిన రవితేజను ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఎంత వరకూ ఆదుకుంటుందో చూడాలి.
{{/usCountry}}ఎందుకంటే ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారీలాంటి సినిమాల నుంచి దీనికి గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రేక్షకులు మెచ్చే ఏదైనా యూనిక్ పాయింట్ ఉంటే తప్ప బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడం కష్టం. తన మాస్ రూటును పక్కన పెట్టి హిట్టు కోసం ఫ్యామిలీ బాట పట్టిన రవితేజను ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఎంత వరకూ ఆదుకుంటుందో చూడాలి.
{{/usCountry}}