Ravi Teja Maruthi: రవితేజ, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో సినిమా అంటేనే ఎంతో క్రేజీగా ఉంది కదా. అయితే అదే నిజం కాబోతోందని ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ది రాజా సాబ్ ఫెయిల్యూర్ తర్వాత కనిపించకుండా పోయిన మారుతి.. ఆ మధ్య తన నెక్ట్స్ మూవీ స్క్రిప్ట్ రెడీ అని అన్నాడు. మరి అది ఇదేనా అన్న సందేహాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
రవితేజ ఇరుముడిలో బిజీ

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ స్పీడ్ గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫలితంతో అస్సలు సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో థియేటర్లలో జాతర చేయడం మన మాస్ మహారాజా స్టైల్. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న 'ఇరుముడి' సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామాపై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే మాస్ రాజా తన నెక్స్ట్ మూవీ లైనప్‌ను మరింత పవర్‌ఫుల్‌గా సెట్ చేసుకుంటున్నట్లు ఫిలిం నగర్ వర్గాల నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతీతో రవితేజ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ది రాజా సాబ్ దెబ్బకు..
డైరెక్టర్ మారుతీ రీసెంట్‌గా రెబల్ స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కించిన భారీ హారర్ కామెడీ మూవీ 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.208 కోట్ల గ్రాస్ వసూలు చేసి అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది. ఈ సినిమా అండర్ పర్ఫార్మెన్స్ తర్వాత మారుతీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. కొన్ని వారాల క్రితమే తను కొత్త స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చారు.
మాస్, కామెడీ టైమింగ్ కాంబినేషన్
ఈ క్రమంలోనే మారుతీ రీసెంట్‌గా రవితేజకు ఒక అదిరిపోయే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లైన్ వినిపించినట్లు టాక్ నడుస్తోంది. మారుతీ మార్క్ మార్కెట్ క్లాస్ కామెడీ టైమింగ్, రవితేజ బాడీ లాంగ్వేజ్ అండ్ మాస్ ఎనర్జీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాను డిజైన్ చేశారట. నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని గత మూడేళ్లుగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇద్దరి బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. ఇప్పుడు ఇద్దరికీ సరైన టైమ్ దొరకడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు లాక్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
ఇరుముడి తర్వాత ఇదేనా?
{{/usCountry}}ఈ క్రమంలోనే మారుతీ రీసెంట్‌గా రవితేజకు ఒక అదిరిపోయే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లైన్ వినిపించినట్లు టాక్ నడుస్తోంది. మారుతీ మార్క్ మార్కెట్ క్లాస్ కామెడీ టైమింగ్, రవితేజ బాడీ లాంగ్వేజ్ అండ్ మాస్ ఎనర్జీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాను డిజైన్ చేశారట. నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని గత మూడేళ్లుగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇద్దరి బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. ఇప్పుడు ఇద్దరికీ సరైన టైమ్ దొరకడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు లాక్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
ఇరుముడి తర్వాత ఇదేనా?
{{/usCountry}}ప్రస్తుతం రవితేజ చేస్తున్న 'ఇరుముడి' సినిమాలో ఆయన అయ్యప్ప స్వామి భక్తుడిగా ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి'కి ఆల్రెడీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎమోషనల్ డ్రామా కంప్లీట్ అయిన వెంటనే మారుతీ సినిమాను పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. ఈ క్రేజీ కాంబోపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే మాత్రం ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పొచ్చు.