రవితేజ నెక్ట్స్ మూవీకి ఫన్నీ టైటిల్.. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం మీకు తెలుసా? సీనియర్ భర్తలు, ఏఐ, గూగుల్ కూడా చెప్పలేదట..

రవితేజ తన నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నాడు. వచ్చే సంక్రాంతి బరిలో నిలవబోతున్న అతని సినిమాకు చాలా ఫన్నీ టైటిల్ పెట్టారు. అంతేకాదు టైటిల్ గ్లింప్స్ వీడియో కూడా నవ్వు తెప్పిస్తోంది. ఇంతకీ ఆ మూవీ టైటిల్ ఏంటో తెలుసా? భర్త మహాశయులకు విజ్ఞప్తి.

Published on: Nov 10, 2025, 17:15:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రవితేజ ఈ మధ్యే మాస్ జాతర మూవీ ఇచ్చిన షాక్ నుంచి పూర్తిగా కోలుకోనే లేదు.. నెక్ట్స్ మూవీకి సిద్ధమయ్యాడు. “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అంటూ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ఓ గ్లింప్స్ వీడియోను సోమవారం (నవంబర్ 10) మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ కు తగినట్లే వీడియో కూడా ఫన్నీగా ఉంది.

రవితేజ నెక్ట్స్ మూవీకి ఫన్నీ టైటిల్.. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం మీకు తెలుసా? సీనియర్ భర్తలు, ఏఐ, గూగుల్ కూడా చెప్పలేదట..
రవితేజ నెక్ట్స్ మూవీకి ఫన్నీ టైటిల్.. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం మీకు తెలుసా? సీనియర్ భర్తలు, ఏఐ, గూగుల్ కూడా చెప్పలేదట..

భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ గ్లింప్స్

రవితేజ, ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. తాజాగా వచ్చిన టైటిల్ గ్లింప్స్ వీడియో కొత్తగా, ఫన్నీగా ఉంది. మాస్ రవితేజను కాస్త భిన్నమైన పాత్రలో ఈ సినిమా చూపించబోతున్నట్లు టైటిల్ గ్లింప్స్ వీడియో చూస్తే తెలుస్తోంది.

ఇందులో ఇద్దరు భామల మధ్య నలిగిపోయే పాత్రలో రవితేజ కనిపిస్తున్నాడు. తన ఇద్దరు భామలు తనను రెండు ప్రశ్నలు అడిగారని, వాటికి సమాధానం కోసం గూగుల్, ఏఐ, జెమిని, చాట్‌జీపీటీలను కూడా అడిగానని, వాటికి పెళ్లి కాకపోవడంతో సమాధానం చెప్పలేకపోయానని రవితేజ చెబుతాడు. ఇక ఆ తర్వాత అనుభవం ఉన్న మగాళ్లు, ముఖ్యంగా మొగుళ్లను అడిగినా.. ఆశ్చర్యపోయారే తప్ప సమాధానం చెప్పలేకపోయారంటాడు.

దీంతో అసలు ఆ ప్రశ్నలు ఏంటి? వాటికి సమాధానం మీకైనా తెలుసా అని అడుగుతున్నట్లుగా ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ టైటిల్ గ్లింప్స వీడియో సాగిపోయింది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ గురించి..

రవితేజ ఈ మధ్యే మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీని ఎంతో లేపడానికి ప్రయత్నించినా.. అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఈ నేపథ్యంలో రవితేజ ఇప్పుడు ఇలా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్నాడు.

తన మార్క్ కామెడీతోపాటు కథాంశం కూడా భిన్నంగా ఉండబోతున్నట్లు ఈ చిన్న వీడియోతో స్పష్టమైంది. అయితే సంక్రాంతికి వస్తుండటంతో అప్పుడు వచ్చే సినిమాలతో ఎలా పోటీ పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More