Thulabharam: క్రైమ్ మహారాజా తులభారం- డిఫరెంట్‌గా రవితేజ, వివేక్ ఆత్రేయ కొత్త సినిమా ప్రోమో- లీకైన టైటిల్‌కే ఓవరాక్షన్!

Ravi Teja Thulabharam Title Promo Released: 'ఇరుముడి' విజయం తర్వాత మాస్ మహారాజా రవితేజ.. క్రేజీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్నారు. 'తులాభారం' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను డాక్యుమెంటరీ పేరుతో విడుదల చేశారు. ఇందులో నటీనటులు చేసిన డిస్కషన్ తెగ ఆకట్టుకుంటోంది.

Published on: Oct 11, 2026, 12:53:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ravi Teja Thulabharam Title Promo Released: బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' సినిమాతో ఘనవిజయం అందుకున్న మాస్ మహారాజా రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. వైవిధ్యమైన కథనాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతుడైన దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

క్రైమ్ మహారాజా తులభారం- డిఫరెంట్‌గా రవితేజ, వివేక్ ఆత్రేయ కొత్త సినిమా ప్రోమో- లీకైన టైటిల్‌కే ఓవరాక్షన్!
క్రైమ్ మహారాజా తులభారం- డిఫరెంట్‌గా రవితేజ, వివేక్ ఆత్రేయ కొత్త సినిమా ప్రోమో- లీకైన టైటిల్‌కే ఓవరాక్షన్!

రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ క్రేజీ చిత్రానికి 'తులాభారం' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని రావు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో టైటిల్ డాక్యుమెంటరీ..

సాధారణంగా సినిమాల టైటిళ్లను పోస్టర్ లేదా చిన్న వీడియో ద్వారా ప్రకటిస్తుంటారు. అయితే వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో ఒక ఆసక్తికరంగా 'టైటిల్ డాక్యుమెంటరీ' పేరుతో ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. టైటిల్ ఎంపిక వెనుక జరిగిన సరదా చర్చలు, బిహైండ్ ది సీన్స్ సన్నివేశాలతో కూడిన ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

'క్రైమ్ మహారాజా'గా రవితేజ!

ఈ ప్రోమో ద్వారా రవితేజ కెరీర్‌లో 'నవ రవితేజము' అనే సరికొత్త అధ్యాయం మొదలైందని మేకర్స్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 'మాస్ మహారాజా'గా అభిమానుల గుండెల్లో నిలిచిన రవితేజను ఈ చిత్రం కోసం 'క్రైమ్ మహారాజా' అని పిలుస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.

టాప్ యాక్టర్స్‌తో టైటిల్ రివీల్

ఈ తులభారంలో రవితేజతోపాటు గ్లామరస్ బ్యూటీ ప్రియాంక మోహన్, మలయాళ భామ అనస్వర రాజన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి నటిస్తున్నారు. తులభాలం ది టైటిల్ డాక్యుమెంటరీ ప్రోమోలో వీరంత కలిసి చేసిన కామెడీ తెగ ఆకట్టుకుంటోంది.

బెల్ సౌండ్ మోగగానే లైట్స్ వేయమని వాయిస్ వినిపిస్తుంది. "ఏం చెప్పాలి.. ఏం చెప్పాలి" అని రవితేజ అంటాడు. మిగతా అందరూ సీరియస్‌గా చూస్తారు. "ఇప్పుడు టైటిల్ అంటే మన కథలో రాజకీయం, కుట్ర కుతంత్రాలు ఉన్నాయి కాబట్టి రాజ్ నీతి అని టైటిల్ పెడదాం" అని తరుణ్ భాస్కర్ అంటాడు.

ఇది ఒక లవ్ స్టోరీ

"బొంగులా ఉంది. ఎక్కడ రాజు ఎక్కడ నీతి. ఇలాంటి టైటిల్ పెడితే జనాలు దొబ్బేయమంటారు. ఇది ఒక లవ్ స్టోరీ. భార్య ప్రేమ కోసం పరితపిస్తున్న భర్త కథ" అని రవితేజ అంటాడు. అలా స్టార్ట్ అయిన చర్చ ఒక్కకొక్కరు వారి క్యారెక్టర్‌కు సంబంధించిన జోనర్‌‌పై టైటిల్ చెబుతూ వస్తారు.

అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ టైటిల్ పెట్టాలని ప్రియాంక మోహన్ అంటుంది. తూకం అని ముందుగా అంటారు. అది బాలేదని తులభారం అని టైటిల్ రివీల్ చేస్తుంది ప్రియాంక మోహన్. "ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. ఇక మొదలుపెడదామా" అని రవితేజ కన్ఫర్మ్ చేస్తాడు. టైటిల్ రివీల్ చేయగానే వచ్చే బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది.

రాజు వచ్చే రవితేజము లలరగ!

"రాజు వచ్చే రవితేజము లలరగ!" అనే పాటను రీమిక్స్ చేసి కొట్టిన బీజీఎమ్ అదిరిపోయింది. టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు ఫుల్ హైప్ ఇచ్చింది. ఇక వీడియో చివరిలో "వీళ్లు లీకైన టైటిల్‌కే ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు. రాను రాను ఇంకేంత చేస్తారో" అని రవితేజ తన మార్క్ మ్యానరిజంతో డైలాగ్ చెప్పి నవ్వించాడు.

'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికి' చిత్రాలకు అద్భుతమైన స్వరాలు అందించిన వివేక్ సాగర్ ఈ తులభారం సినిమాకు సంగీతాన్ని సమకూర్చుతున్నారు. తేని ఈశ్వర్ (ISC) ఛాయాగ్రహణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More