Rayavalasa: ఒక్క షెడ్యూల్‌లో సినిమా పూర్తి- వెనకాల అమ్మవారు, ఇంటెన్స్ లుక్‌తో రాయవలస రిలీజ్ డేట్ పోస్టర్
Karthik Jayanthi Rayavalasa Release Date Poster: కార్తీక్ జయంతి, శ్రీష నూలు జంటగా నటిస్తున్న గ్రామీణ నేపథ్య చిత్రం 'రాయవలస' విడుదల తేదీ ఖరారైంది. విజయదశమి సందర్భంగా ఈ చిత్ర పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఆరోజున రాయవలస సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
Karthik Jayanthi Rayavalasa Release Date Poster: పండుగ వేళ టాలీవుడ్ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా అప్‌డేట్ బయటికొచ్చింది. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోపీ కృష్ణ జె నిర్మాతగా, ఎన్నారై డైరెక్టర్ రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయవలస’.

జోడీగా హీరోయిన్ శ్రీషా నులు
ఈ చిత్రంలో డైరెక్టర్ రాధిక కుమారుడు కార్తీక్ జయంతి హీరోగా చేస్తున్నాడు. అతనికి జోడీగా హీరోయిన్‌గా శ్రీషా నులు నటిస్తోంది. అమెరికా నుంచి కార్తీక్ జయంతి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ‘రాయవలస’తో కార్తీక్ జయంతి తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా రానున్నారు.
యూట్యూబ్‌లో 1 మిలియన్‌కుపైగా వ్యూస్
ఇప్పటి వరకు రాయవలస సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన ‘రింగుడు రింగుడు’ సాంగ్ యూట్యూబ్‌లో వన్ మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 11న విడుదల
తాజాగా దసరా పండుగ స్పెషల్ అంటూ ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘రాయవలస’ మూవీని డిసెంబర్ 11న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. దసరా సందర్భంగా వదిలిన రాయవలస పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో ఇంటెన్స్‌తో కూడుకున్న హీరో సీరియస్ లుక్, వెనకాల అమ్మవారు అన్నీ కూడా పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
ఒకే షెడ్యూల్‌లో పూర్తి
గ్రామీణ జీవితం, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ‘రాయవలస’ రూపొందింది. నటీనటులు, సాంకేతిక బృందం అంకితభావంతో రాయవలస చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న శ్రీషా నులు, ‘రాణి’ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్‌గా అర్జున్ బాల
తన సహజమైన నటన, హుందాతనంతో రాణి పాత్రకు ప్రత్యేకతను తీసుకొచ్చారు. తొలి చిత్రంతోనే కార్తిక్ జయంతి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోన్నారు. ఈ చిత్రానికి అర్జున్ బాల మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ పాటలకు సాహిత్యం అందించారు.
పాట పాడిన హీరో
రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తీక్ జయంతి పాటలు పాడటం విశేషం. రాయవలస సినిమాకి వి.ఆర్.కె. నాయుడు (కిట్టు) కెమెరామెన్‌గా, గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. డిసెంబర్ 11న రాయవలస మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
రాయవలస నటీనటులు
రాయవలస సినిమాలో హీరోహీరోయిన్లతోపాటు అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవివర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధరావు, కంచరపాలెం రాజు, సుహాసన్, వివేక్ వర్ధన్, మృదుల, గాంధీ, లక్ష్మణ్, లండన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


