IPL 2026 Final GT vs RCB: ఆర్సీబీ బౌలర్ల ఊచకోత.. తక్కువ స్కోరుకే గుజరాత్ టైటాన్స్ పరిమితం- భువీకి పర్పుల్ క్యాప్!
IPL 2026 Final GT vs RCB Highlights: ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విశ్వరూపం చూపించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌ను 155 పరుగులకే కట్టడి చేసి మ్యాచ్‌పై పట్టు సాధించారు. గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ హైలెట్స్ చూస్తే..!
IPL 2026 Final GT vs RCB Highlights: ఐపీఎల్ 2026 మహాసంగ్రామం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ సీజన్ అంతటా తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో తలపడుతున్నాయి.

8 వికెట్లకు 155 రన్స్
కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్‌ను చక్కగా వాడుకున్న బెంగళూరు బౌలర్లు.. గుజరాత్ బ్యాటర్లను ఆది నుంచే ఉక్కిరిబిక్కిరి చేశారు. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గుజరాత్‌ను దారుణంగా ఓడించిన ఆర్సీబీ, అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించింది. పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేసి గుజరాత్ టైటాన్స్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితం చేసింది.
కుప్పకూలిన టాప్ ఆర్డర్.. గిల్, బట్లర్ ఫ్లాప్
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. ఆ జట్టు నమ్ముకున్న స్టార్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ దారుణంగా నిరాశపరిచారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే సుదర్శన్ అవుట్ కాకుండా రివ్యూ ద్వారా బతికిపోయినప్పటికీ, ఆ తర్వాత ఎక్కువసేపు నిలవలేకపోయాడు.
జోరు మీదున్న శుభ్‌మన్ గిల్ (22 పరుగుల వద్ద) హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో గుజరాత్ తొలి దెబ్బ తింది. ఆ తర్వాతి బంతికే సాయి సుదర్శన్‌ను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ చేర్చడంతో స్టేడియం మొత్తం ఆర్సీబీ నామస్మరణతో మారుమోగిపోయింది.
ఆ తర్వాత వచ్చిన స్టార్ బ్యాటర్ జూస్ బట్లర్‌ను ఆర్సీబీ మిస్టర్ రిలయబుల్ స్పిన్నర్ కృనాల్ పాండ్యా అద్భుతమైన స్టంపింగ్‌తో అవుట్ చేయడంతో గుజరాత్ 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం..
ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన పోరాటపటిమను కనబరిచాడు. ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం చేశాడు. అతడికి అదృష్టం కూడా కలిసి వచ్చింది. జాకబ్ డఫ్ఫీ బౌలింగ్‌లో సుందర్ ఇచ్చిన క్యాచ్‌ను ఆర్సీబీ ఫీల్డర్ చేజార్చాడు. ఈ అవకాశాన్ని వాడుకున్న సుందర్ విలువైన అర్ధ శతకం (50*) సాధించి జట్టు స్కోరును వంద దాటించాడు.
సింధు కొన్ని బౌండరీలతో ఆకట్టుకున్నా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. నిర్ణిత ఓవర్లలో రాసిఖ్ దార్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాహుల్ తెవాటియా (115/5 వద్ద) వికెట్‌తో పాటు మొత్తం 3 వికెట్లు పడగొట్టి గుజరాత్ నడుం విరిచాడు.
భువీకి 'పర్పుల్ క్యాప్'
సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన స్పెల్‌లో జేసన్ హోల్డర్ వికెట్ తీయడం ద్వారా ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి 'పర్పుల్ క్యాప్' కైవసం చేసుకున్నాడు. చివరి ఓవర్లలో రషీద్ ఖాన్ ఒక సిక్స్ కొట్టి తర్వాతి బంతికే అవుట్ కావడంతో గుజరాత్ ఇన్నింగ్స్ 155 పరుగుల వద్ద ముగిసింది.
వరుసగా రెండోసారి
ఐదేళ్లలో మూడోసారి ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయింది. వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిక్యం లభించింది.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిచి రెండోసారి టైటిల్ సాధించాలంటే ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు చేయాల్సి ఉంది. బెంగళూరు బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే ఈ టార్గెట్ పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


