...
...
Next Story

OTT Horror: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అదిరే హారర్ థ్రిల్లర్.. 207 శాతం ప్రాఫిట్ తెచ్చిన మూవీ.. రక్తం చిందించే ఆట!

OTT Horror: హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన మోస్ట్ అవేటెడ్ హారర్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్‌కు టైం ఫిక్స్ అయింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ రక్తం చిందించే భయంకరమైన ఆట చుట్టూ సాగే మూవీ వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Jul 15, 2026 02:07 PM IST
Advertisement

OTT Horror: తెలుగు డిజిటల్ ఆడియన్స్‌లో ఈ మధ్య కాలంలో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఒరిజినల్ జోనర్‌ను ఎంజాయ్ చేసే ఆడియన్స్ కోసం ఓటీటీ సంస్థలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను రంగంలోకి దించుతున్నాయి. ఇప్పుడు అలాంటి ‘రెడీ ఆర్ నాట్ 2: హియర్ ఐ కమ్’ ఓటీటీలోకి రాబోతుంది.

ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్

మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అదిరే హారర్ థ్రిల్లర్.. 207 శాతం ప్రాఫిట్ తెచ్చిన మూవీ.. రక్తం చిందించే ఆట! (x)
మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అదిరే హారర్ థ్రిల్లర్.. 207 శాతం ప్రాఫిట్ తెచ్చిన మూవీ.. రక్తం చిందించే ఆట! (x)

బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన హారర్ థ్రిల్లర్ ‘రెడీ ఆర్ నాట్ 2’ ఓటీటీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ మూవీ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. జూలై 16 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ లోకి రాబోతుంది ఈ సినిమా.

సింహాసనం కోసం రక్తపాతం

2019లో వచ్చిన కల్ట్ హిట్ హారర్ చిత్రం ‘రెడీ ఆర్ నాట్’కు ఈ ‘రెడీ ఆర్ నాట్ 2’ అనేది డైరెక్ట్ సీక్వెల్. మొదటి భాగంలో లె డోమాస్ ఫ్యామిలీ చేసిన ప్రాణాంతక సాంప్రదాయ వేట నుంచి గ్రేస్ (సమరా వీవింగ్) ఎలాగోలా బతికి బయటపడుతుంది. అయితే, ఈ పార్ట్ 2లో ఆ ఆట మరింత క్రూరంగా, తదుపరి స్థాయికి చేరుకుంటుంది.

సీక్రెట్ కౌన్సిల్

ఈసారి గ్రేస్‌కు ఆమె సోదరి ఫెయిత్ (కాథరిన్ న్యూటన్) తోడవుతుంది. ప్రపంచాన్ని శాసించే ఒక రహస్య కౌన్సిల్ అత్యున్నత పీఠాన్ని దక్కించుకోవడం కోసం నాలుగు బడా ప్రత్యర్థి కుటుంబాలు గ్రేస్‌ను వేటాడటమే ఈ సినిమా ప్లాట్. ఈ రక్తం చిందించే ఆటలో గెలిచిన వారే గ్లోబల్ పవర్‌ను కంట్రోల్ చేస్తారు.

కేవలం హారర్ మాత్రమే కాదు

ఇందులో వేటాడే పాత్రలు తమకు వేరే మార్గం లేదని, ఆ సాంప్రదాయ వ్యవస్థే తమను ఇలా బలిపశువులను చేస్తోందని నమ్ముతుంటాయి. తప్పించుకోలేని ఈ క్లిష్ట పరిస్థితి ఓ తరం నుంచి మరో తరానికి ఎలా పాకుతుందనే సామాజిక కోణాన్ని హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రచయితలు గై బుసిక్, ఆర్ క్రిస్టోఫర్ మర్ఫీ అద్భుతంగా ఆవిష్కరించారు.

తలదన్నే లాభాలు

హాలీవుడ్‌లో తక్కువ బడ్జెట్‌తో వచ్చి భారీ రిటర్న్స్ రాబట్టే జోనర్ ఏదైనా ఉందంటే అది హారర్ మాత్రమే అని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. కేవలం 14 మిలియన్ డాలర్ల (రూ.134 కోట్లు) పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రెడీ ఆర్ నాట్ 2’ థియేట్రికల్ రన్‌లో వరల్డ్‌వైడ్‌గా ఏకంగా 42.9 మిలియన్ డాలర్ల (రూ.412 కోట్లు) వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అంటే 207 శాతం లాభాలు తెచ్చిపెట్టింది ఈ మూవీ.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe