ప్రభాస్ లీడ్ రోల్ లో, మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుంది. అయితే తాజాగా మంగళవారం (నవంబర్ 11) మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ తో ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేశారు.
ప్రభాస్ ది రాజా సాబ్ పోస్టర్

రెబల్ స్టార్ ప్రభాస్, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ ది రాజా సాబ్. ఈ హారర్ కామెడీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అభిమానులు ఊహించని విధంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ వచ్చింది. డైరెక్టర్ మారుతి ఈ పోస్టర్ ను షేర్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలోకి ప్రభాస్ వచ్చి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పోస్టర్ ను తీసుకురావడం విశేషం. ఈ పోస్టర్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. నోట్లో సిగార్ తో ప్రభాస్ లుక్ వైరల్ అవుతోంది.
“23 ఏళ్ల కిందట అతడు సినిమాలో తొలి అడుగు వేశాడు. అదే రోజు ది రాజా సాబ్ లో అతడు తన ప్రయాణాన్ని ముగించాడు. అతని ఈ జైత్రయాత్రలో నేనూ భాగమైనందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ది రాజా సాబ్ పూర్తిగా భిన్నమైన ఎనర్జీ అని సూపర్ షూర్ గా ఉన్నాను. మీ ప్రేమ, అసహనం గురించి తెలుసు. కచ్చితమైన బెస్ట్ అందిస్తామన్న నమ్మకం ఉంది. రెబల్ గాడ్ భక్తులకు ముందు ముందు మరిన్ని సెలబ్రేటింగ్ రోజులు రానున్నాయి” అని మారుతి ట్వీట్ చేశాడు.
ది రాజా సాబ్ గురించి..
ప్రభాస్ కల్కి 2898 ఏడీ తర్వాత నటిస్తున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ఆలస్యమైంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
{{/usCountry}}ప్రభాస్ కల్కి 2898 ఏడీ తర్వాత నటిస్తున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ఆలస్యమైంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
{{/usCountry}}