Jailer 2 OTT: తలైవా రజినీకాంత్ క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన అలా స్టైల్ గా నడిచొస్తే చాలు థియేటర్లు మోత మోగిపోతాయి. ఆయన మూవీ హిట్ అయిందంటే ఆ సందడే వేరు. అలాంటి రజినీకాంత్ సూపర్ హిట్ మూవీనే జైలర్. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా జైలర్ 2 రాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
జైలర్ 2 ఓటీటీ

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ జైలర్ 2. సూపర్ హిట్ జైలర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై హైప్ ఆకాశాన్ని తాకుతోంది. తాజాగా జైలర్ 2 మూవీ ఓటీటీ రైట్స్ కోసం రికార్డు డీల్ కుదిరిందనే టాక్ ఇందుకు నిదర్శనం. జైలర్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలిసింది.
రికార్డు రేట్
జైలర్ 2 ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రికార్డు రేట్ చెల్లించిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ కోసం ఏకంగా రూ.160 కోట్ల డీల్ జరిగిందని సమాచారం. ఈ డీల్ తో జైలర్ 2 చిత్రం కొత్త రికార్డు క్రియేట్ చేసిందని అంటున్నారు. తమిళ సినీ ఇండస్ట్రీలోనే ఓ మూవీకి దక్కిన అత్యధిక ఓటీటీ డీల్ రేట్ ఇదేనని చెప్తున్నారు.
హైయ్యస్ట్
ఓటీటీ రైట్స్ కోసం అత్యధిక ధర దక్కించుకున్న తమిళ సినిమాగా జైలర్ 2 నిలిచిందని అంటున్నారు. కమల్ హాసన్ థగ్ లైఫ్ రికార్డును జైలర్ 2 బ్రేక్ చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కమల్ హాసన్ మూవీకి ఓటీటీ హక్కుల రూపంలో రూ.150 కోట్లు దక్కినట్లు టాక్. ఇప్పుడు జైలర్ 2కు అంతకంటే ఎక్కువే వచ్చాయని సమాచారం.
జైలర్ 2 గురించి
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2023లో వచ్చిన జైలర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా జైలర్ 2 రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిందని రజినీకాంత్ రీసెంట్ గా పేర్కొన్న సంగతి తెలిసిందే. 2026లోనే జైలర్ 2 రిలీజ్ కానుంది.
{{/usCountry}}నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2023లో వచ్చిన జైలర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా జైలర్ 2 రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిందని రజినీకాంత్ రీసెంట్ గా పేర్కొన్న సంగతి తెలిసిందే. 2026లోనే జైలర్ 2 రిలీజ్ కానుంది.
{{/usCountry}}జైలర్ 2తో టైగర్ ముత్తువేల్ పాండియన్ గా రజినీకాంత్ మరోసారి తన పవర్ చూపించబోతున్నాడు. ఈ సినిమాలో ఎస్జే సూర్య, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు. జైలర్ 2ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జైలర్ హిట్ తో జైలర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.