...
...
Next Story

OTT Thriller: మర్డర్ మిస్టరీ.. మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Thriller: ఓటీటీలోకి ఓ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. హత్య కేసులో ఇరుక్కునే హీరో ఎలా తప్పించుకున్నాడు? తాను నిర్దోషినని ఎలా నిరూపించుకున్నాడు? అనే కథ థ్రిల్ పంచుతుంది.

Published on: May 19, 2026, 09:45:21 IST
Advertisement

OTT Thriller: కొత్త వారం వచ్చిందంటే ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్ ల సందడి ఉంటుంది. కొత్త రిలీజ్ లతో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు కళకళలాడుతుంటాయి. ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త మూవీస్ రాబోతున్నాయి. తాజాగా తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ ‘రెడ్ లేబుల్’ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

రెడ్ లేబుల్ ఓటీటీ

ఓటీటీలోకి తమిళ్ థ్రిల్లర్ (x/SimplySouthApp)
ఓటీటీలోకి తమిళ్ థ్రిల్లర్ (x/SimplySouthApp)

తమిళంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ ‘రెడ్ లేబుల్’. అక్కడ మిక్స్ డ్ రియాక్షన్ దక్కించుకున్న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఈ వారమే డిజిటల్ డెబ్యూ చేయనుంది. శుక్రవారం (మే 22) ఓటీటీలో అడుగుపెట్టనుంది. సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది.

క్రైమ్ థ్రిల్లర్

కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తిరిగే క్రైమ్ థ్రిల్లర్ గా రెడ్ లేబుల్ మూవీ తెరకెక్కింది. ఇందులో లెనిన్, అజ్మిన్ యాసర్ హీరో హీరోయిన్లుగా నటించారు. వీళ్లతో పాటు ఆర్వీ ఉదయకుమార్, మునిష్కాంత్ తదితరులు నటించారు. ఈ సినిమాకు కేఆర్ వినోద్ డైరెక్టర్. ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలో రిలీజైంది రెడ్ లేబుల్ మూవీ. ఇప్పుడు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది.

రెడ్ లేబుల్ స్టోరీ

మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ రెడ్ లేబుల్. ఇది కాథిర్ (లెనిన్) కథ. అతను ఓ కాలేజ్ ఫార్మర్ ఛైర్మన్. ఇప్పుడు పోలీసు కేసుల కారణంగా సైలెంట్ గా ఉంటాడు. రోహిత్ అనే స్టూడెంట్ అతని దగ్గరకు వస్తాడు. ఎమ్మెల్యే (ఆర్వీ ఉదయకుమార్) కొడుకు పాండ్యన్ కాలేజ్ లో గుండాయిజం చెలాయిస్తుంటాడు.

కాథిర్ పై పగ తీర్చుకోవడం కోసం పవిత్రను ఓ రౌడీకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. అయితే అతనితో కాథిర్ గొడవ పడతాడు. ఈ క్రమంలో ఆ రౌడీ చనిపోతాడు. ఆ మర్డర్ కేసులో కాథిర్ ఇరుక్కుంటాడు. మరి ఈ కేసు నుంచి అతను ఎలా బయటపడ్డాడు? కాలేజ్ స్టూడెంట్ల నుంచి అతనికి ఎలాంటి సపోర్ట్ లభించింది? పవిత్రను అతను పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది రెడ్ లేబుల్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe