Regina Cassandra: సౌత్ సినిమాపై విషం చిమ్ముతున్నారా? కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు వేరే ఆప్షన్ లేదంటూ!

Regina Cassandra: బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా జాన్వీ కపూర్, రాధికా ఆప్టే సౌత్ సినిమాపై చేసిన వ్యాఖ్యలకు హీరోయిన్ రెజీనా కసాండ్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇదే క్రమంలో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్‌పై సైతం సంచలన ఆరోపణలు చేసింది.

Published on: Nov 5, 2026, 13:44:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Regina Cassandra: సౌత్ ఇండియన్ సినిమాలపై బాలీవుడ్ తారలు తరచుగా చేస్తున్న కామెంట్స్‌పై టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన నటీనటులు, ప్రేక్షకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటీవల 'పెద్ది' సినిమా వివాదంలో జాన్వీ కపూర్.. "సౌత్‌లో బౌండ్ స్క్రిప్టులు ఉండవు" అని చేసిన వ్యాఖ్యలు, అలాగే రాధికా ఆప్టే సౌత్ సినిమా కల్చర్‌పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

సౌత్ సినిమాపై విషం చిమ్ముతున్నారా? కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు వేరే ఆప్షన్ లేదంటూ!
సౌత్ సినిమాపై విషం చిమ్ముతున్నారా? కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు వేరే ఆప్షన్ లేదంటూ!

రెజీనా కసాండ్రా ఫైర్

మహాశక్తి (మూకుతి అమ్మన్ 2) సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ పై రెజీనా కసాండ్రా ఫైర్ అయింది. ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై రెజీనా ఘాటుగా స్పందించింది. ఉత్తరాది నటీనటులు కావాలనే ఇలాంటి విభేదాలు సృష్టిస్తున్నారని ఆమె ఫైర్ అయింది.

కరణ్ జోహార్‌పై సంచలన ఆరోపణలు

జాన్వీ కపూర్, రాధికా ఆప్టే వ్యాఖ్యలను తిప్పికొడుతూనే, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌పై రెజీనా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. "నార్త్ ఇండియన్ యాక్టర్స్ ఎవరైనా సౌత్ సినిమా గురించి మాట్లాడి, నార్త్-సౌత్ అనే విభేదాలు సృష్టించేలా కామెంట్స్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది" అని రెజీనా కుండబద్దలు కొట్టింది. తన సొంత అనుభవాన్ని వివరిస్తూ, కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ తనను ఎలా అవమానించిందో రెజీనా వెల్లడించింది.

కారణం లేకుండానే ప్రమోషన్స్ నుంచి ఔట్

ధర్మా ప్రొడక్షన్స్‌లో జరిగిన అవమానాన్ని రెజీనా వివరిస్తూ.. "నేను కరణ్ జోహార్ ప్రొడక్షన్‌లో ఒక సినిమా చేశాను. అందులో నాది చాలా కీలకమైన పాత్ర. కానీ నన్ను ప్రమోట్ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఎలాంటి కారణం, వివరణ ఇవ్వకుండానే ప్రమోషన్స్ నుంచి నా పేరును తీసేశారు. కనీసం నాపై షూట్ చేసిన ఒక పాటను రిలీజ్ చేసినప్పుడు కూడా నన్ను ట్యాగ్ చేయలేదు" అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది.

నేను సౌత్ హీరోయిన్‌ని కాబట్టేనా?

తనను ప్రమోషన్స్‌కు పిలవకపోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని ప్రశ్నిస్తూ మేకర్స్‌కు సూటి ప్రశ్న వేసింది రెజీనా. "దీన్ని నేను ఏమని పిలవాలి? నేను ఒక సౌత్ ఇండియన్ హీరోయిన్‌ని కాబట్టే నన్ను ఇలా పక్కన పెట్టేశారా?" అంటూ సూటిగా నిలదీసింది. బాలీవుడ్‌కు ఇప్పుడు సౌత్ యాక్టర్స్ అవసరం ఎంతైనా ఉందని, వాళ్లకు వేరే ఆప్షన్ లేదని కూడా రెజీనా గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్

రెజీనా చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి. జాన్వీ కపూర్, రాధికా ఆప్టే లాంటి వాళ్లు సౌత్ సినిమాల్లో అవకాశాలు పొందుతూనే సౌత్ ఇండస్ట్రీని కించపరచడం కరెక్ట్ కాదని, రెజీనా అడిగిన ప్రశ్నల్లో న్యాయం ఉందని నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా రెజీనా చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More