రేణు దేశాయ్ కు తీవ్రమైన కోపమొచ్చింది. తన గురించి నీచమైన కామెంట్లు చేస్తున్న వాళ్లపై ఆమె ఫైర్ అయింది. శనివారం (ఫిబ్రవరి 28) ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో రెచ్చిపోయింది. బూతులు పెట్టే వాళ్లను ఇకపై వదలనని వార్నింగ్ ఇచ్చింది.
విడాకుల తర్వాత

‘‘నా విడాకుల తర్వాత నా గురంచి అన్ని రకాలుగా కామెంట్ చేశారు. ఇంకా ఏం మిగల్లేదని అనుకున్నా. కానీ నేను జనవరిలో కుక్కల గురించి ప్రెస్ మీట్ పెట్టా. కొన్ని ఎన్జీవోలు కలిసి నన్ను ప్రెస్ మీట్ కు రమ్మంటే, ఫస్ట్ నేను రానని చెప్పా. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే నాకు తిట్లు రావడం తప్పా ఏం ఉండదు అని క్లియర్ గా చెప్పా. కానీ మీరు మాట్లాడితేనే బాగుంటుందని పిలిచారు’’ అని రేణు దేశాయ్ తెలిపింది.
ఏమైనా తప్పుందా?
‘‘వందల కుక్కులను చంపేస్తున్నారంటే నాకూ బాధ వేసింది. వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయి. దాని కోసం 90 కుక్కలను చంపకూడదని ప్రెస్ మీట్లో అన్నా. ఇందులో ఏమైనా తప్పుందా? నా మాటలను అర్థం చేసుకోకుండా మీడియా, స్టూపిడ్ యూట్యూబ్, స్టూపిడ్ ఇన్ స్టాగ్రామ్ లో సర్కస్ చేశారు. నన్ను బూతులు తిట్టారు’’ అని రేణు దేశాయ్ ఫైర్ అయింది
ఆ కామెంట్ చదివి
‘‘మనకు మాట్లాడే హక్కు ఉంది. నా బట్టలు బాలేకపోతే, యాక్టింగ్ నచ్చకపోతే చెప్పొచ్చు. కానీ ప్రతిసారి పర్సనల్ లైఫ్ లోకి వచ్చి తిడుతున్నారు.
ప్రెస్ మీట్ లో ఓ వ్యక్తి వచ్చి నన్ను దున్నపోతు అన్నాడు. దాంతో కోప్పడ్డా. కానీ అవేమీ పట్టించుకోకుండా ఆమెకే రేబిస్ వచ్చిందని అన్నారు. ఈ పిచ్చి కుక్కలు రేణు దేశాయ్ ప్రైవేట్ పార్ట్స్ ను కరిస్తే అప్పుడు తెలుస్తుందనే కామెంట్ చదివి వణికిపోయా’’ అని రేణు దేశాయ్ చెప్పింది.
నాకేం సంబంధం?
{{/usCountry}}ప్రెస్ మీట్ లో ఓ వ్యక్తి వచ్చి నన్ను దున్నపోతు అన్నాడు. దాంతో కోప్పడ్డా. కానీ అవేమీ పట్టించుకోకుండా ఆమెకే రేబిస్ వచ్చిందని అన్నారు. ఈ పిచ్చి కుక్కలు రేణు దేశాయ్ ప్రైవేట్ పార్ట్స్ ను కరిస్తే అప్పుడు తెలుస్తుందనే కామెంట్ చదివి వణికిపోయా’’ అని రేణు దేశాయ్ చెప్పింది.
నాకేం సంబంధం?
{{/usCountry}}‘‘మొన్న ఓ కుల వివక్ష కారణంగా ఫైట్ లో చిన్నబిడ్డ చనిపోయింది. ఇందులో నాకు సంబంధమే లేదు. కానీ ఒక పనికి మాలిన వెధవ నేను కుక్కల గురించి మాట్లాడిన వీడియో పెట్టాడు. నన్ను తిడుతున్నారు. నాకు సంబంధం ఉందా? ప్రతిసారి నా మీద ఎందుకు పడుతున్నారు. ఆ బిడ్డను చంపిన వాళ్లను అరెస్ట్ చేయించండి’’ అని రేణు దేశాయ్ పేర్కొంది.
పనికి మాలిన వెధవల్లా
‘‘చేతిలో 5 వేల ఫోన్ పెట్టుకుని తిట్టడం ఎంత వరకు సంస్కారం. ఈ సారి బూతుల కామెంట్ చూస్తే మీ ఇంటి వరకు వస్తా. మీ అమ్మానాన్నకు, చెల్లెల్లకు మీ కామెంట్లు చూపిస్తా. పిల్లలను ఎలా పెంచారని మీ అమ్మను అడుగుతా. మీరు పనికి మాలిన వెధవల్లా ఉండిపోతారు.
నేను కాశీకి వెళ్తే మీకు ఏం ప్రాబ్లం? దానికి బూతులు ఎందుకు కామెంట్లు పెడతారు. నేను పబ్లిక్ లో వచ్చి కూర్చుంటా. వచ్చి నన్ను, నా పిల్లలను, నా తల్లిదండ్రులను తిట్టండి. కానీ దాని వల్ల ఒక్క ప్రాణమైనా సేవ్ అవుతుందా? అవుతుంది అంటే నేను భరిస్తా.
కాశీలో దిగిన ఫొటోకు ఏమో నైట్ రేట్ అంత అని అడుగుతారా? ఇది కరెక్ట్ కాదు. మీకు దమ్ము లేదు. దమ్ముంటే మీ ఎమ్మెల్యేను ఇలాగే తిట్టండి.
నేను యానిమల్ ఎన్జీవో పెట్టా. జంతువుల గురించి మాట్లాడుతా. మీకు మనుషుల గురించి బాధ ఉంటే మనుషుల గురించి ఆలోచించే ఎన్జీవోలు ఉన్నాయి కదా వాళ్లను అడగండి’’ అని రేణు దేశాయ్ ఫైర్ అయింది.