Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బద్రి, ఖుషి, జానీ, బాలు.. ఇలా ఎన్నో సినిమాలు ఆయన స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ వెనుక రేణు దేశాయ్ కష్టం కూడా ఉంది. నటిగానే కాకుండా పవన్ సినిమాలకు ఆమె స్టైలిస్ట్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా 'విజువల్ టాక్స్' అనే పాడ్ కాస్ట్ లో పాల్గొన్న రేణు.. 2001 నాటి కొన్ని అరుదైన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
లండన్ మాల్ లో కరణ్ జోహార్ తో షాపింగ్

ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన బట్టలు కొనడానికి రేణు దేశాయ్ ప్రత్యేకంగా లండన్ వెళ్లేవారట. అక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ కు వెళ్లినప్పుడు ఎదురైన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను ఆమె వివరించారు. "ఆ మాల్ లో కేవలం ఇద్దరం మాత్రమే ఉండేవాళ్ళం. ఒకరు నేను కాగా, మరొకరు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్.
నేను పవన్ కళ్యాణ్ కోసం బట్టలు వెతుకుతుంటే, షారుక్ ఖాన్ కోసం కరణ్ జోహార్ బట్టలు సెలెక్ట్ చేసేవారు" అని రేణు చెప్పారు. కరణ్ కు షారుక్ పై ఉన్న ప్రేమతో అలా చేసేవారని, తాను పవన్ స్టైలిస్ట్ గా ఆ పని చేశానని ఆమె గుర్తు చేసుకున్నారు.
బాలు ప్యాంట్ స్టోరీ
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బాలు' (2005) సినిమాలో ఆయన కాస్ట్యూమ్స్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. ముఖ్యంగా ఆ సినిమాలో పవన్ వేసుకున్న ఒక ప్యాంట్ గురించి రేణు షాకింగ్ నిజాలు చెప్పారు. ఆ ప్యాంట్ ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదని, దానికి రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి చరిత్ర ఉందని ఆమె తెలిపారు.
ఆ ఒక్క ప్యాంట్ కొనుగోలు చేయడానికి అప్పట్లోనే సుమారు రూ. 75,000 ఖర్చు చేశారట. ఒక సినిమా కోసం కాస్ట్యూమ్స్ పై వారు పెట్టిన శ్రద్ధకు ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు.
నటన కంటే ప్రొడక్షన్ పైనే ఇష్టం
{{/usCountry}}ఆ ఒక్క ప్యాంట్ కొనుగోలు చేయడానికి అప్పట్లోనే సుమారు రూ. 75,000 ఖర్చు చేశారట. ఒక సినిమా కోసం కాస్ట్యూమ్స్ పై వారు పెట్టిన శ్రద్ధకు ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు.
నటన కంటే ప్రొడక్షన్ పైనే ఇష్టం
{{/usCountry}}తనకు మొదటి నుంచీ తెరపై కనిపించి హీరోయిన్ గా నటించడం కంటే, కెమెరా వెనుక ఉండి సినిమా మేకింగ్ లో పాల్గొనడం అంటేనే ఎక్కువ ఇష్టం అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన 'జానీ' సినిమాకి తను ప్రొడక్షన్ డిజైనర్ గా ఎలా పనిచేశానో కూడా ఈ పాడ్ కాస్ట్ లో ఆమె వివరించారు.
ప్రశాంతంగా ఫామ్ హౌస్ లో గడపడం, ఆకాశాన్ని చూస్తూ ఉండిపోవడం తనకు ఇష్టమైన వ్యాపకాలు అని రేణు తన వ్యక్తిగత ఆసక్తులను పంచుకున్నారు. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ చెప్పిన ఈ ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో, గూగుల్ లో వైరల్ గా మారాయి.