...
...
Next Story

Renu Desai: పవన్ కళ్యాణ్ మూడో విడాకుల వేళ ట్రెండింగ్ లో రేణు దేశాయ్ పేరు.. కారణం ఇదే.. హిందూ వ్యతిరేకిని అంటారంటూ!

Renu Desai: మంగళవారం (నవంబర్ 11) పొద్దునే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఫాలోవర్లకు షాకింగ్ న్యూస్ చెవిలో పడింది. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడిపోయారనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. అందుకు కారణం ఏంటో ఇక్కడ చూసేయండి.

Published on: Nov 10, 2026, 11:08:45 IST
Advertisement

Renu Desai: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు, జనసేన ఫాలోవర్స్ కు బిగ్ షాక్. పవన్ కళ్యాణ్ విడాకుల విషయం ఆయన వ్యక్తిగతమైందే అయినప్పటికీ.. ఈ వార్తను పవర్ స్టార్ ఫ్యాన్స్, పార్టీ ఫాలోవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పేరు ట్రెండింగ్ లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది.

ట్రెండింగ్ గా రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ మూడో విడాకుల వేళ ట్రెండింగ్ లో రేణు దేశాయ్ పేరు.. కారణం ఇదే!
పవన్ కళ్యాణ్ మూడో విడాకుల వేళ ట్రెండింగ్ లో రేణు దేశాయ్ పేరు.. కారణం ఇదే!

ప్రస్తుతం గూగుల్ ట్రెండ్స్, సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్ లో రేణు దేశాయ్ పేరు మార్మోగుతోంది. ఓ వైపు పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల వార్త వైరల్ కాగా.. మరోవైపు రేణు దేశాయ్ పేరు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అయితే దీనికి వేరే కారణం ఉంది. పవన్ కళ్యాణ్ మూడో విడాకులతో రేణు దేశాయ్ కు ఎలాంటి సంబంధం లేదు.

కారణం ఇదే

దీపావళి పండగ సంద్భరంగా కొంతమంది ప్రవర్తనతో విసుగెత్తిన రేణు దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఫైర్ అయింది. పండుగ సందర్భంగా కాల్చిన టపాసులతో కొన్ని చోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రేణు దేశాయ్ తన ఇన్ స్టా స్టోరీల్లో ఇలాంటి మూడు వీడియోలు పోస్టు చేసింది.

హిందూ వ్యతిరేకిని అంటారంటూ

‘‘ఇప్పుడు రాత్రి 11 గంటలు. అయినా జనాలు భారీ శబ్దాలు వచ్చే క్రాకర్స్ పేలుస్తున్నారు. నిన్న (దీపావళి రోజు) నేను ఏమైనా అని ఉంటే హిందూ వ్యతిరేకిని అని పిలిచేవాళ్లు. కానీ ఈ రోజు (దీపావళి తర్వాతి రోజు నవంబర్ 9) ఏ పండగ ఉందని రాత్రి 11 గంటలకు జనాలు భారీ శబ్దాలు వచ్చే క్రాకర్స్ కాలుస్తున్నారు?

అలాగే ఓ నెటిజన్ ఇంట్లో జరిగిన ప్రమాద వీడియోను కూడా రేణు దేశాయ్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. ‘‘దీపావళి పూజ కంటే ముందు మా ఇంటి కిటికీలో నుంచి ఓ రాకెట్ లేపలికి వచ్చి పేలింది. అంతా డ్యామేజ్ అయింది. మేం ప్రమాదంలో పడ్డాం. కానీ దేవుని దయ వల్ల అందరం క్షేమంగా ఉన్నాం’’ అని ఓ నెటిజన్ పెట్టిన వీడియోను రేణు పోస్టు చేసింది.

రేణు దేశాయ్ ఇన్ స్టా స్టోరీ
 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks