...
...
Next Story

Renu Desai OTT: రేణు దేశాయ్ ఓటీటీ ఎంట్రీ.. ఇవాళ డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌కు మూవీ.. కథ కూడా ఆమెదే.. ఆ బ్యాగ్ లో ఏముంది?

Renu Desai OTT: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా వెలుగొందిన రేణు దేశాయ్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. ఓ హార్ట్ టచింగ్ లవ్ రొమాంటిక్ మూవీలో ఆమె నటించారు. అంతే కాకుండా ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఆమె అందించడం విశేషం. ఇంతకీ ఈ సినిమా ఏంటీ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

Published on: Sep 13, 2026, 14:15:29 IST
Advertisement

Renu Desai OTT: పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి', 'జానీ' వంటి చిత్రాలలో నటించి మెప్పించిన రేణు దేశాయ్ ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. 2023లో వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో హేమలతా లవణం పాత్రలో కనిపించిన ఆమె, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీ ద్వారా ఆడియన్స్ కు కనిపించారు.

కాశీ మజిలీ ఓటీటీ

రేణు దేశాయ్ ఓటీటీ ఎంట్రీ.. ఇవాళ డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌కు మూవీ.. కథ కూడా ఆమెదే.. ఆ బ్యాగ్ లో ఏముంది? (youtube/etvwin)
రేణు దేశాయ్ ఓటీటీ ఎంట్రీ.. ఇవాళ డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌కు మూవీ.. కథ కూడా ఆమెదే.. ఆ బ్యాగ్ లో ఏముంది? (youtube/etvwin)

రేణు దేశాయ్ లీడ్ రోల్ ప్లే చేసిన ‘కాశీ మజిలీ’ అనే చిన్న చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 13) డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. యమునా కిషోర్ దర్శకత్వంలో జెకే ఆర్ట్స్ పతాకంపై జగదీష్ కుమార్ కల్లూరు నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ 'కథా సుధ' సిరీస్‌లో భాగంగా నేరుగా డిజిటల్ డెబ్యూ చేసింది.

నటిగానే కాకుండా

మూడేళ్ల విరామం తర్వాత రేణు దేశాయ్ ఓ సినిమాలో యాక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అయితే కాశీ మజిలీ మూవీలో ఆమె కేవలం ఓ కీలక పాత్ర పోషించడమే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, మాటల రచయిత్రిగా తనలోని సరికొత్త టాలెంట్ ను చూపించారు.

కాశీ మజిలీ అసలు కథేంటి?

కాశీకి వెళ్లిన ఓ మహిళ, మరో యువకుడు తమ లగేజీ పోగొట్టుకుంటారు. వారణాసిలో తమ లగేజీ కోసం వెతుకుతుంటారు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తారు. అయితే డబ్బు, బ్యాంకు కార్డులు పోయినా పర్లేదు కానీ ఆ బ్యాగు మాత్రం తనకు ఇప్పించాలని ఓ మహిళ పోలీసులను వేడుకుంటుంది. మరి ఆ బ్యాగులో ఏముంది? అనేది కాశీ మజిలీ మూవీలో చూడాల్సిందే.

రెండో ప్రేమ

ఆధ్యాత్మికతకు నిలయమైన వారణాసి (కాశీ) తీరాల్లో, గంగా నది ఘాట్‌ల బ్యాక్‌డ్రాప్‌లో సన్నివేశాలను చిత్రీకరించడం వల్ల ఈ రొమాంటిక్ డ్రామాకు ఆధ్యాత్మిక సౌందర్యం సమకూరింది. సీనియర్ రచయిత అబ్బూరి రవి డైలాగ్ సూపర్‌విజన్ చేయగా, డాక్టర్ జోస్యభట్ల సంగీతం సమకూర్చారు.

కథా సుధ సిరీస్

తెలుగు డిజిటల్ స్పేస్‌లో ‘ఈటీవీ విన్’ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'కథా సుధ' వీక్లీ సిరీస్ పేరుతో ప్రతి సండే ఓ షార్ట్ ఫిల్మ్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఇవాళ కాశీ మజిలీ అనే మూవీ వచ్చేసింది. గతంలో నటిగా, మోడల్‌గా, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన రేణు దేశాయ్.. ఈ చిత్రంతో పూర్తిస్థాయి కథా-స్క్రీన్‌ప్లే రచయిత్రిగా మారడం ఆమె క్రియేటివ్ జర్నీలో మరో మైల్ స్టోన్ లాంటిదే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks