చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.
Renu Desai: లక్ష్మిదేవిని పూజిస్తారు కానీ ఆడవాళ్లను గౌరవించరు.. అలాంటి భర్త అందరికీ ఉండాలి: రేణు దేశాయ్
Renu Desai: పెళ్లయిన ఆడవాళ్లు, వాళ్ల భర్తల గురించి రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న శ్రీమతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రేణు దేశాయ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
Renu Desai: జీ5 తెలుగు ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ కాబోతున్న మూవీ ‘శ్రీమతి’. ఇందులో నివేదా థామస్, తిరువీర్ ప్రధాన పాత్రలు పోషించారు. రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇవాళ (నవంబర్ 29) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

రేణు దేశాయ్ కామెంట్స్
పబ్లిక్ ఈవెంట్లలో ఎక్కువగా మాట్లాడని రేణు దేశాయ్.. శ్రీమతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం చాలా టైమ్ తీసుకొని తాను చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేశారు. ‘‘ఇప్పటికీ బాంబే, ఢిల్లీ లేదా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆడవాళ్లను చూసే పద్దతిలో ఎలాంటి మార్పు రావడం లేదు.
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఫలానా వాళ్ల అమ్మాయి అని అంటారు. పెద్దయ్యాక పెళ్లయిన వెంటనే ఫలానా వాళ్ల వైఫ్ అని స్టాంప్ పడిపోతుంది. తన సొంత ఐడెంటిటీని అమ్మాయిలు పోగొట్టుకుంటున్నారు’’ అని రేణు దేశాయ్ తెలిపారు.
ఆడవాళ్లను గౌరవించరు
‘‘గుడికి వెళ్లి లక్ష్మి దేవికి పూజ చేస్తారు. కానీ ఇంట్లో ఉన్న లక్ష్మిదేవిని మాత్రం గుర్తించరు. ఆడవాళ్లను గౌరవించరు. మెజారిటీ మగవాళ్లు ఇలాగే చేస్తారు. ఓ అమ్మాయి కోడలి అయిన వెంటనే అంతా మారిపోతుంది. ఆడవాళ్లను మగాళ్లు అర్థం చేసుకోవాలి. మేమేం రోబోలం కాదు. బిడ్డకు జన్మనివ్వడంతోనే మన కథ ముగిసిపోయినట్లు కాదు. శ్రీమతి లాంటి సినిమాలు ప్రతి భాషలో రావాలి’’ అని రేణు దేశాయ్ చెప్పారు.
నివేదాతో సినిమా
‘‘నివేదా థామస్ తో సిరీస్ అనగానే ఎగిరి గంతేశా. ఆమె పర్ఫార్మెన్స్ అంటే నాకెంతో ఇష్టం. తను ముందు నిలబడి డైలాగ్స్ చెప్పాలనుకున్నా. తిరువీర్ తో కలిసి యాక్టింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. తిరువీర్ భార్య కల్పన నాకు ఎప్పటి నుంచో తెలుసు’’ అని రేణు దేశాయ్ అన్నారు.
అలాంటి భర్త
‘‘తిరువీర్ లాంటి తమ్ముడు నాకు ఉంటే ఎంతో బాగుండేది. తిరువీర్ చేసిన యాక్టింగ్ కు రియల్ లైఫ్ కు చాలా తేడా ఉంది. ఆయన స్వీటెస్ట్ హస్బెండ్. తన భార్య కల్పనను చాలా బాగా చూసుకుంటాడు. మగవాళ్లు ఇలా ఉండాలి. నన్ను తిట్టినా సరే ఈ మాట చెప్తున్నా. నీ లాంటి భర్త అందరికీ ఉంటే బాగుంటుంది. నువ్వు నీ భార్యకు చాలా సపోర్ట్ చేస్తావు. ఆమెకు ఫ్రీడం ఇస్తావు’’ అని తిరువీర్ గురించి రేణు దేశాయ్ గొప్పగా చెప్పారు.
శ్రీమతి ఓటీటీ
క్లాసికల్ డ్యాన్సర్ కావాలనే కల కన్న అమ్మాయి జీవితం పెళ్లి తర్వాత ఎలా మారిపోతుందనే కథతో తీసిన సినిమానే శ్రీమతి. ఇది డిసెంబర్ 4న డైరెక్ట్ గా జీ5 తెలుగు ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఆ రోజే రేణు దేశాయ్ బర్త్ డే కావడంతో.. తన పుట్టిన రోజుకు రిలీజ్ అవుతున్న ఈ మూవీ తన కెరీర్ లో ఎంతో స్పెషల్ అని రేణు దేశాయ్ వెల్లడించారు.

E-Paper
