...
...
Next Story

Renu Desai: బూతులు తిట్టడానికి మేము టెర్రరిస్టులమా.. ఎందుకు తిడుతున్నారు..: నెటిజన్లపై రేణు దేశాయ్ ఆగ్రహం

Renu Desai: సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై జరుగుతున్న ట్రోలింగ్‌పై నటి రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆర్టిస్టులను నేరస్తుల్లా, ఉగ్రవాదుల్లా భావిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించింది.

Published on: Apr 06, 2026 10:20 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Renu Desai: ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని విప్పింది. గత కొంతకాలంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు చేస్తున్న అసభ్యకర కామెంట్లను ఆమె తీవ్రంగా ఖండించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు, వ్యక్తిగత దూషణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలని ఆమె ఘాటుగా విమర్శించింది.

నేరస్తుల కంటే హీనంగా చూస్తారా?

Renu Desai: బూతులు తిట్టడానికి మేము టెర్రరిస్టులమా.. ఎందుకు తిడుతున్నారు..: నెటిజన్లపై రేణు దేశాయ్ ఆగ్రహం
Renu Desai: బూతులు తిట్టడానికి మేము టెర్రరిస్టులమా.. ఎందుకు తిడుతున్నారు..: నెటిజన్లపై రేణు దేశాయ్ ఆగ్రహం

తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన రేణు దేశాయ్.. "కళాకారులంటే మీ దృష్టిలో నేరస్తులా లేక ఉగ్రవాదులా? అంత దారుణమైన పదజాలంతో దూషించడానికి వారేం తప్పు చేశారు?" అని ప్రశ్నించింది.

ఒక వ్యక్తి చేసే పని లేదా వారు చెప్పే మాటలు మీకు నచ్చకపోతే, సింపుల్‌గా వారిని అన్‌ఫాలో చేసి మీ దారి మీరు చూసుకోవాలి తప్ప.. ఇలాంటి నీచమైన మాటలు అనడం సంస్కారం కాదని ఆమె హితవు పలికింది.

“నిజంగానే మరీ ఇంత చెత్తగా మాట్లాడటానికి ఆ ఆర్టిస్టులు ఏమైనా నేరస్తులా లేక ఉగ్రవాదులా? భావ ప్రకటనా స్వేచ్ఛకి, బూతులకు మధ్య ఉన్న తేడా మీకెందుకు అర్థం కావడం లేదు? మీకు వారి పని లేదా వారు చెప్పేది నచ్చకపోతే, ఇలా భయంకరమైన మాటలు మాట్లాడటానికి బదులుగా వారిని అన్‌ఫాలో చేసి ముందుకు సాగిపోండి” అనే క్యాప్షన్ తో రేణు ఓ వీడియోను పోస్ట్ చేసింది.

భావ ప్రకటన స్వేచ్ఛ అంటే బూతులు తిట్టడం కాదు

ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ 'ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్' (Freedom of Speech) పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆమె పేర్కొంది. "మీకు నచ్చని అభిప్రాయం చెబితే వెంటనే బూతులు తిట్టడం స్వేచ్ఛ అనిపించుకోదు. అది కేవలం వేధింపు మాత్రమే. ప్రతి మనిషికి గౌరవంగా బతికే హక్కు ఉంటుంది. దాన్ని కాలరాయకండి" అంటూ రేణు దేశాయ్ స్పష్టం చేసింది.

మద్దతు తెలుపుతున్న సినీ వర్గాలు

గతంలో కూడా రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితంపై వచ్చే నెగిటివ్ కామెంట్లను దీటుగా ఎదుర్కొంది. మరోసారి ఆమె చేసిన ఈ పోస్ట్.. సైబర్ వేధింపులకు వ్యతిరేకంగా ఒక బలమైన గళంగా నిలుస్తోంది. ఇక ఈ మధ్యే ఆమె ధురంధర్ 2 మూవీ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe