Prabhas Romamchakam: ‘మేం ఫేమస్’ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుమంత్ ప్రభాస్. అతను, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘రొమాంచకం’ (Romanchakam). వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ‘భద్రకాళి పిక్చర్స్’ పతాకంపై తెరకెక్కించిన ఈ చిత్రం రేపు (సెప్టెంబర్ 3) థియేటర్లలోకి రానుంది. ఈ మూవీకి ప్రభాస్ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
స్పిరిట్ ను దాటి

రోమాంచకం మూవీ హీరో సుమంత్ ప్రభాస్ తాజాగా డార్లింగ్ ప్రభాస్ ను కలిశాడు. ‘‘ఆల్ ది బెస్ట్. ఇరగదీసేయ్. బ్లాక్ బస్టర్ అయిపోవాలి. స్పిరిట్ ను కూడా దాటేయాలి’’ అని సుమంత్ తో ప్రభాస్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోను మేకర్స్ పోస్టు చేశారు. కానీ ఇందులో ప్రభాస్ ఫేస్ మాత్రం కనిపించడం లేదు.
పెయిడ్ ప్రీమియర్స్
రోమాంచకం సినిమా పెయిడ్ ప్రిమియర్స్ ఈ రోజు (సెప్టెంబర్ 2) రాత్రి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి. రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేకంగా సుమంత్‌ను కలిసి అభినందించడం, "నా సినిమాల కంటే రొమాంచకం పెద్ద హిట్ కావాలి" అని ఆకాంక్షించడంతో ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
{{/usCountry}}రోమాంచకం సినిమా పెయిడ్ ప్రిమియర్స్ ఈ రోజు (సెప్టెంబర్ 2) రాత్రి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి. రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేకంగా సుమంత్‌ను కలిసి అభినందించడం, "నా సినిమాల కంటే రొమాంచకం పెద్ద హిట్ కావాలి" అని ఆకాంక్షించడంతో ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
{{/usCountry}}సాధారణంగా చిన్న సినిమాలకు ప్రీ-రిలీజ్ బుకింగ్స్ రావడం కష్టం. కానీ ‘రొమాంచకం’ టీమ్ కాన్ఫిడెన్స్‌తో ఒక రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ ప్రదర్శిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రాత్రి పడబోయే ప్రిమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఆశాజనకంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్
రోమాంచకం సినిమా కేవలం ఒక రొటీన్ లవ్ స్టోరీ మాత్రమే కాదు. ప్రేమకథకు థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను జోడించి కథనాన్ని నడిపించినట్లు మేకర్స్ తెలిపారు. ప్రమోషనల్ కంటెంట్, పాటలకు ఇప్పటికే యూత్‌లో మంచి రెస్పాన్స్ లభించింది.
సుమంత్ ప్రభాస్ పేరు స్టోరీ
రోమాంచకం హీరో సుమంత్ ప్రభాస్ స్టోరీ వెనుక ఒక కథ ఉంది. తన అసలు పేరు సుమంత్ అయినప్పటికీ, బాహుబలి స్టార్ ప్రభాస్ పట్ల ఉన్న విపరీతమైన అభిమానంతో తన పేరు వెనుక ‘ప్రభాస్’ అని చేర్చుకున్నాడు సుమంత్. ఇప్పుడు ప్రభాస్ నేరుగా సుమంత్ షర్ట్ మీద ఆటోగ్రాఫ్ ఇవ్వడం వైరల్ గా మారింది.
సందీప్ బ్రాండ్
రోమాంచకం సినిమాకు పబ్లిసిటీ కేవలం స్టార్ హీరోల బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీనికి ప్రెజెంటర్‌గా ఉండటంతో వైబ్ ఏర్పడిందని చెప్పొచ్చు. ‘అర్జున్ రెడ్డి’ నిర్మించిన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పైనే ఈ చిత్రం రూపొందింది. సందీప్ వంగా స్వయంగా ఒక ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేస్తున్నారంటే అందులో కంటెంట్ రోస్టెడ్‌గా, బోల్డ్‌గా, యూత్‌ఫుల్‌గా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది.