'స్త్రీ 2' విజయం తర్వాత, మ్యాడాక్ ఫిల్మ్స్ ప్రేక్షకులను అలరించడానికి మరో హారర్-కామెడీ చిత్రం ‘థామా’తో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హారర్, రొమాన్స్ తో రెచ్చిపోయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలకడ కొనసాగిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ఈ వాంపైర్ హారర్-కామెడీ చిత్రం దీపావళికి థియేటర్లలో విడుదలైంది. మంచి ప్రారంభం తర్వాత ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది.
థామా కలెక్షన్లు

ట్రేడ్ ట్రాకింగ్ సైట్ సక్నిల్క్ నివేదిక ప్రకారం థామా ఫస్ట్ డే రూ.24 కోట్లు సంపాదించింది. రెండో రోజు ఖాతాలో రూ.18.6 కోట్లు చేరాయి. మూడవ రోజు (అక్టోబర్ 23) ఈ సినిమా వసూళ్లలో స్వల్ప తగ్గుదల కనిపించింది. గురువారం రూ.10.42 కోట్లు సంపాదించింది. దీంతో మూడు రోజుల్లో సినిమా మొత్తం వసూళ్లు ఇప్పుడు రూ.53.02 కోట్లకు చేరాయి. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో సాగిపోతున్న రష్మిక మందన్న ఈ మూవీతో మరోసారి కలెక్షన్ల హాఫ్ సెంచరీ కొట్టేసింది.
కాజోల్ ను దాటి
థామా మూవీ ఇప్పటికే కాజోల్ ఇటీవలి హారర్ చిత్రం 'మా' లైఫ్‌టైమ్ కలెక్షన్లను అధిగమించింది. ఆ సినిమా ఇండియా దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.36.08 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.49.75 కోట్లు వసూలు చేసింది. హర్షవర్ధన్ రాణే, సోనమ్ బజ్వాల 'ఏక్ దీవానే కీ దీవానియత్' కూడా ‘ధామా' విడుదలైన రోజే (అక్టోబర్ 21) రిలీజ్ అయింది. కానీ పోటీలో ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా సినిమానే ముందుంది. ఇది కాకుండా వరుణ్ ధావన్ నటించిన 'భేడియా' లైఫ్‌టైమ్ కలెక్షన్లను (భారత్‌లో నెట్ రూ.68.99 కోట్లు) అధిగమించడానికి థామా దగ్గరగా ఉంది.
థామా సినిమా గురించి..
ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించి.. నీరెన్ భట్, సురేష్ మాథ్యూ, అరుణ్ ఫలారా రచించిన ఈ హారర్-కామెడీ డ్రామా థామా మ్యాడాక్ హారర్-కామెడీ యూనివర్స్‌లో నాల్గవ చిత్రం. ఈ కథ ఒక జర్నలిస్ట్ (ఆయుష్మాన్ ఖురానా) చుట్టూ తిరుగుతుంది. అతను ఒక మిస్టరీ మహిళను (రష్మిక మందన్న) కలిసిన తర్వాత, 'బేతాళ్' అనే వాంపైర్ లాంటి జీవిగా మారిపోతాడు. ఒక పురాతన దుష్టశక్తి (నవాజుద్దీన్ సిద్ధిఖీ) రక్తదాహం నుండి మానవాళిని కాపాడాల్సి వస్తుంది. ఈ చిత్రానికి విమర్శకుల నుండి చాలా వరకు సానుకూల సమీక్షలు, అలాగే ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభించాయి.
{{/usCountry}}ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించి.. నీరెన్ భట్, సురేష్ మాథ్యూ, అరుణ్ ఫలారా రచించిన ఈ హారర్-కామెడీ డ్రామా థామా మ్యాడాక్ హారర్-కామెడీ యూనివర్స్‌లో నాల్గవ చిత్రం. ఈ కథ ఒక జర్నలిస్ట్ (ఆయుష్మాన్ ఖురానా) చుట్టూ తిరుగుతుంది. అతను ఒక మిస్టరీ మహిళను (రష్మిక మందన్న) కలిసిన తర్వాత, 'బేతాళ్' అనే వాంపైర్ లాంటి జీవిగా మారిపోతాడు. ఒక పురాతన దుష్టశక్తి (నవాజుద్దీన్ సిద్ధిఖీ) రక్తదాహం నుండి మానవాళిని కాపాడాల్సి వస్తుంది. ఈ చిత్రానికి విమర్శకుల నుండి చాలా వరకు సానుకూల సమీక్షలు, అలాగే ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభించాయి.
{{/usCountry}}