Romantic Web Series OTT: తన సబ్ స్కైబర్లకు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్ చెప్పింది. వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన వెబ్ సిరీస్ ‘ఆఫ్ క్యాంపస్’ కు సీజన్ 2 తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్ క్యాంపస్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రైమ్ వీడియో ప్రకటించేసింది.
ఆఫ్ క్యాంపస్ సీజన్ 2 ఓటీటీ

ఓటీటీలో రొమాంటిక్ వెబ్ సిరీస్ లు వస్తూనే ఉంటాయి. అయితే ఆఫ్ క్యాంపస్ వెబ్ సిరీస్ మాత్రం రొమాంటిక్ జోనర్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. కాలేజీ లవ్, రొమాన్స్ కథతో నడిచే ఈ వెబ్ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతుంది. ఆఫ్ క్యాంపస్ సీజన్ 2 వెబ్ సిరీస్ ఏప్రిల్ 28, 2027 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
బ్లాక్ బస్టర్ సీజన్ 1
2026 మేలో వచ్చిన ఆఫ్ క్యాంపస్ మొదటి సీజన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 36 మిలియన్ల వ్యూస్ సాధించింది. అప్పట్లో ప్రైమ్ వీడియోలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 3 డెబ్యూ సిరీస్ లలో ఇది ఒకటిగా నిలిచింది. ఇక సీజన్ 2లో మికా అబ్దల్లా, స్టీఫెన్ కాలిన్ తో పాటు ఎల్లా బ్రైట్, బెల్మాంట్ కామెలీ, జాలెన్ థామస్ బ్రూక్స్ తదితరులు నటించనున్నారు.
ఈసారి అల్లీ, డీన్ ల వంతు
ఆఫ్ క్యాంపస్ ఫస్ట్ సీజన్ భారీ విజయం సాధించడంతో సీజన్ 2 పై అంచనాలు పెరిగాయి. ఈసారి కథంతా అల్లీ హేస్ (మికా అబ్దల్లా), డీన్ డి లారెన్టిస్ (స్టీఫెన్ కాలిన్) పాత్రల చుట్టూ తిరగనుంది. వారిద్దరి మధ్య రొమాన్స్ ఈ సీజన్ కు హైలైట్ గా నిలవనుంది. ఎలైట్ కాలేజ్ ఐస్ హాకీ టీమ్, వారి జీవితాల నేపథ్యంలో సాగే ఈ కథలో.. హాకీతో పాటు టీనేజ్ రొమాన్స్, స్నేహం, బ్రేకప్స్, కెరీర్ సవాళ్లు వంటి అంశాలను చాలా అద్భుతంగా చూపించనున్నారు.
'ది స్కోర్' నవల ఆధారంగా..
{{/usCountry}}ఆఫ్ క్యాంపస్ ఫస్ట్ సీజన్ భారీ విజయం సాధించడంతో సీజన్ 2 పై అంచనాలు పెరిగాయి. ఈసారి కథంతా అల్లీ హేస్ (మికా అబ్దల్లా), డీన్ డి లారెన్టిస్ (స్టీఫెన్ కాలిన్) పాత్రల చుట్టూ తిరగనుంది. వారిద్దరి మధ్య రొమాన్స్ ఈ సీజన్ కు హైలైట్ గా నిలవనుంది. ఎలైట్ కాలేజ్ ఐస్ హాకీ టీమ్, వారి జీవితాల నేపథ్యంలో సాగే ఈ కథలో.. హాకీతో పాటు టీనేజ్ రొమాన్స్, స్నేహం, బ్రేకప్స్, కెరీర్ సవాళ్లు వంటి అంశాలను చాలా అద్భుతంగా చూపించనున్నారు.
'ది స్కోర్' నవల ఆధారంగా..
{{/usCountry}}నిజానికి ఎల్లే కెన్నెడీ పుస్తకాల్లో మొదటిది హన్నా, గారెట్ ల కథతో 'ది డీల్' (The Deal) పేరుతో మొదలవుతుంది. ఆ తర్వాత 'ద మిస్టేక్' (The Mistake) వస్తుంది. కానీ, ప్రైమ్ వీడియో మాత్రం నేరుగా మూడో పుస్తకమైన 'ది స్కోర్' (The Score) కథతో సెకండ్ సీజన్ ను నిర్మిస్తోంది. అల్లీ, డీన్ ల రొమాన్స్ ను తెరపైకి తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.
అసలు డీన్, అల్లీ కథేంటి?
బ్రియార్ యూనివర్సిటీలో డీన్ ఒక పెద్ద హాకీ స్టార్. అతనికి ప్లేబాయ్ అనే ఇమేజ్ కూడా ఉంది. ఎప్పుడూ ఫ్లర్ట్ చేస్తూ, క్యాజువల్ రిలేషన్స్ కే ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు తప్ప ఎమోషనల్ అటాచ్‌మెంట్స్ పెట్టుకోడు. మరోవైపు అల్లీ తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తర్వాత జీవితంలో ఏం చేయాలనే సందిగ్ధంలో ఉంటుంది.
నటి కావాలనే కోరిక, కుటుంబ ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న అల్లీ.. అనుకోకుండా ఆఫ్-క్యాంపస్ హాకీ హౌస్ లో ఉండాల్సి వస్తుంది. అక్కడే డీన్ తో పరిచయం ఏర్పడుతుంది. ఒక రాత్రితో ముగిసిపోతుందనుకున్న వీరి పరిచయం.. ఆ తర్వాత ఎలాంటి మలుపులు తిరిగిందనేది సీజన్ 2పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.