తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగ రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరం ట్యాంక్‌బండ్ వద్ద ఈ వేడుకలు కన్నుల పండువగా సాగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలన్నీ పండుగ శోభతో విలసిల్లాయి.
బతుకమ్మ సంబరాల్లో విజయ్-రష్మిక
{{^htLoading}} {{/htLoading}}
వేడుకల్లో భాగంగా ట్యాంక్‌బండ్ అమరవీరుల స్మారక చిహ్నం నుంచి భారీ మహా బతుకమ్మ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో సుమారు 700 మంది జానపద కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకోగా, 600 మందికి పైగా మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలతో ఊరేగింపుగా తరలివచ్చారు.
ట్యాంక్‌బండ్ వేదికగా నిర్వహించిన బతుకమ్మ ఆటలు, కోలాటాలు, జానపద గేయాలు విశేషంగా అలరించాయి. ఈ సద్దుల బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క హాజరయ్యారు. వీరితో పాటు టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారిని మంత్రి జూపల్లి శాలువతో సత్కరించారు.
నూతన దంపతులుగా ఈ వేడుకల్లో పాల్గొన్న విజయ్-రష్మిక జంట మహిళలతో కలిసి బతుకమ్మ సంబురాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. వారి రాక ట్యాంక్‌బండ్ వద్ద కోలాహలంగా మారింది. హుస్సేన్ సాగర్ తీరాన బతుకమ్మ వేడుకల్లో నిర్వహించిన లేజర్ షో, రంగురంగుల బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.