...
...
Next Story

Sai Dharam Tej: ‘క’ మూవీ యంగ్ డైరెక్టర్స్ తో సాయి దుర్గా తేజ్ సినిమా.. యుగాల రహస్యం అంటూ పోస్టర్.. ఇంట్రెస్టింగ్

Sai Dharam Tej: మెగా సుప్రీం స్టార్ సాయి దుర్గా తేజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సై అన్నాడు. ‘క’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ల డ్యుయోతో కలిసి సినిమా చేయబోతున్నాడు. శుక్రవారం రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

Published on: Apr 3, 2026, 12:45:32 IST
Advertisement

విరూపాక్ష సినిమా సక్సెస్ తో డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్). ప్రస్తుతం ‘సంబరాల యేటి గట్టు’ మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించాడు.

సాయి దుర్గా తేజ్ సినిమా

సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా పోస్టర్ (x/Sai Dharam Tej)
సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా పోస్టర్ (x/Sai Dharam Tej)

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ మరో భారీ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతున్నాడు. ‘క’ మూవీ డైరెక్టర్లు సుజీత్, సందీప్ తో కలిసి సాయి దుర్గా తేజ్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ ను శుక్రవారం (ఏప్రిల్ 3) రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

యుగాల రహస్యం

‘‘యుగాల రహస్యం.. ఊహకు అందని శక్తి. నిజంగా ఎంతో శక్తిమంతమైన దాంట్లోకి అడుగుపెడుతున్నా. డైనమిక్ డైరెక్టర్లు సుజీత్, సందీప్ తో పాటు తపన ఉన్న ప్రొడ్యూసర్ సాహు గారపాటితో కలిసి ఈ జర్మీలో భాగమైనందుకు ఎగ్జైటింగ్ గా ఉంది’’ అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ ను సాయి దుర్గా తేజ్ ఎక్స్ లో పంచుకున్నాడు.

విశ్వం కథలు

కాస్మిక్ క్రానికల్స్ అనే పదాన్ని బట్టి సాయి దుర్గా తేజ్ మూవీ సైన్స్ ఫిక్షనా లేకపోతే మైథాలజీనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొండ వెనకాల ఆకాశంలో జరిగే అద్భుతాన్ని కింది నుంచి చూస్తున్న ఓ వ్యక్తి పోస్టర్ తో ఈ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

ఎస్‌డీటీ 19

ఎస్‌డీటీ 19 అనే వర్కింగ్ టైటిల్ పై ఈ సినిమా పట్టాలెక్కనుంది. సాయి దుర్గా తేజ్ కు ఇది 19వ మూవీ. చిరంజీవి మేనళ్లుడైన సాయి దుర్గా తేజ్ 2023లో విరూపాక్షతో సక్సెస్ అందుకున్నాడు. ఆ హారర్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ను వణికించింది.

ఇప్పుడు కొత్త డైరెక్టర్ రోహిత్ కేపీ డైరెక్షన్ తో ‘సంబరాల యేటి గట్టు’ అనే సినిమా చేస్తున్నాడు సాయి దుర్గా తేజ్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇదే ఏడాది రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks