Sai Durgha Tej Engagement: సాయి దుర్గా తేజ్ ఎంగేజ్‌మెంట్.. మెగా, అల్లు ఫ్యామిలీస్ ఒకే ఫొటోలో.. పెళ్లి ఎప్పుడంటే?

Sai Durga Tej Engagement: టాలీవుడ్ హీరో సాయి దుర్గా తేజ్ ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. ఇందులో మెగా, అల్లు ఫ్యామిలీస్ మొత్తం ఒక్క చోట చేరింది. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Nov 5, 2026, 22:02:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sai Durga Tej Engagement: టాలీవుడ్ సుప్రీమ్ హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్) త్వరలోనే ఒక ఇంటివారు కాబోతున్నారు. ఆయన వివాహ ప్రయాణానికి సంబంధించి తొలి అడుగు పడింది. గురువారం (నవంబర్ 5, 2026న) సాయి దుర్గా తేజ్, కిరణ్‌ల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ప్రముఖ 'హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్' వేదికగా అత్యంత వైభవంగా జరిగింది.

Sai Durgha Tej Engagement: సాయి దుర్గా తేజ్ ఎంగేజ్‌మెంట్.. మెగా, అల్లు ఫ్యామిలీస్ ఒకే ఫొటోలో.. పెళ్లి ఎప్పుడంటే?
Sai Durgha Tej Engagement: సాయి దుర్గా తేజ్ ఎంగేజ్‌మెంట్.. మెగా, అల్లు ఫ్యామిలీస్ ఒకే ఫొటోలో.. పెళ్లి ఎప్పుడంటే?

కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ నిశ్చితార్థ వేడుక మెగా, అల్లు కుటుంబాలకు ఒక ప్రత్యేకమైన వేడుకగా నిలిచింది. ఇరు కుటుంబాల సభ్యులంతా ఒకే వేదికపైకి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు.

మెగా, అల్లు కాంపౌండ్స్ గ్రాండ్ రీ-యూనియన్

గత కొంతకాలంగా వేర్వేరు కార్యక్రమాల్లో కనిపించిన మెగా, అల్లు కుటుంబ సభ్యులు సాయి దుర్గా తేజ్ శుభకార్యం కోసం ఒకేచోట చేరి సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పండుగ వాతావరణాన్ని తలపించిన ఈ వేడుకలో మెగా కాంపౌండ్‌కు చెందిన యంగ్ హీరోలు, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేశారు.

వేడుకలో మెరిసిన ప్రముఖుల జాబితా

ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకలో సాయి దుర్గా తేజ్ కుటుంబం నుంచి తల్లిదండ్రులు డాక్టర్ శివప్రసాద్ - విజయదుర్గ, సోదరుడు వైష్ణవ్ తేజ్ ఉన్నారు. ఇక మెగా కుటుంబం నుంచి మెగాస్టార్ చిరంజీవి - సురేఖ, రామ్ చరణ్, నాగబాబు - పద్మజ, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, నిహారిక కొణిదెల, అకిరా నందన్, ఆద్య వచ్చారు.

అటు అల్లు కుటుంబం తరఫున అల్లు అరవింద్ - నిర్మల, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి, అల్లు బాబీ - నీలా షా, అల్లు శిరీష్ - నయనికా రెడ్డి ఉన్నారు. ఈ రెండు ఫ్యామిలీస్ కాకుండా మంచు మనోజ్ - భూమా మౌనిక రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ, కమెడియన్ హర్ష చెముడు, దర్శకుడు వెంకీ కుడుముల, నటుడు నవదీప్, నిర్మత హర్షిత్ రెడ్డి తదితరులు ఈ నిశ్చితార్థానికి వచ్చారు.

హైదరాబాద్‌లో గ్రాండ్ వెడ్డింగ్.. ముహూర్తం ఎప్పుడంటే?

సాయి దుర్గా తేజ్ - కిరణ్‌ల నిశ్చితార్థం వైభవంగా పూర్తికావడంతో, అందరి దృష్టి ఇప్పుడు వివాహ ముహూర్తంపై పడింది. కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, వీరిద్దరి వివాహం రాబోయే డిసెంబర్ 10, 2026న హైదరాబాద్‌లోనే అత్యంత వేడుకగా జరగనుంది.

రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని.. ‘విరూపాక్ష’, ‘బ్రో’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న సాయి దుర్గా తేజ్, ఇప్పుడు జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుండటంతో అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. డిసెంబర్ 10న జరగబోయే ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా హాజరయ్యే అవకాశం ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More