బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కుమారుడు, యువ నటుడు జునైద్ ఖాన్ కెరీర్‌పై ప్రత్యేక దృష్టి సారించాడు. జునైద్ హీరోగా, సౌత్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా ఒక స్వచ్ఛమైన లవ్ స్టోరీని ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు ‘ఏక్ దిన్’ (ఒక రోజు) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. గురువారం (జనవరి 15) నాడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ విడుదల చేసింది.
మంచులో రొమాంటిక్ జర్నీ

ఏక్ దిన్ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులకు ఒక ఫీల్ గుడ్ వైబ్‌ని ఇస్తోంది. చుట్టూ మంచు కురుస్తుండగా.. జునైద్, సాయి పల్లవి చేతిలో ఐస్‌క్రీమ్ పట్టుకొని నవ్వుతూ నడుచుకుంటూ వెళ్తున్న సీన్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. "ఒకే ప్రేమ.. ఒకే అవకాశం" అనే క్యాప్షన్ సినిమాలోని గాఢతను తెలియజేస్తోంది. "జీవితపు గందరగోళంలో.. ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.. ఏక్ దిన్" అంటూ మేకర్స్ పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది.
అంజానా అంజానీ కాపీనా?
అయితే ఈ పోస్టర్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. జునైద్, సాయి పల్లవి జోడీ చాలా బాగుందని, 2000 దశకంలో వచ్చిన రొమాంటిక్ సినిమాల ఫీల్ కలుగుతోందని కొందరు ప్రశంసిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఇది రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా నటించిన ‘అంజానా అంజానీ’ పోస్టర్‌ను పోలి ఉందని విమర్శిస్తున్నారు. "వారి గెటప్, ఆ బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే అంజానా అంజానీ కాపీలా ఉందేంటి?" అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
జునైద్‌కు కలిసొచ్చేనా?
గతంలో ఖుషీ కపూర్ సరసన జునైద్ నటించిన ‘లవ్‌యాపా’ (Loveyapa) బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమా తనకు వ్యక్తిగతంగా నచ్చినప్పటికీ, ఫలితం నిరాశపరిచిందని ఆమిర్ ఖాన్ గతంలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు సాయి పల్లవి వంటి బలమైన నటితో జునైద్‌ను జత కట్టడం ద్వారా ఆమిర్ కొత్త మ్యాజిక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
ఏక్ దిన్ సినిమా విశేషాలు
సాయి పల్లవి, జునైద్ ఖాన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఏక్ దిన్ మూవీని సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది ‘వన్ డే’ (One Day) అనే థాయ్ సినిమాకు రీమేక్ అని సమాచారం. ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణా పురోహిత్ మూవీని నిర్మిస్తుండగా.. రామ్ సంపత్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ శుక్రవారం (జనవరి 16న) విడుదల కానుండగా, సినిమా మే 1న థియేటర్లలోకి రానుంది.
{{/usCountry}}సాయి పల్లవి, జునైద్ ఖాన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఏక్ దిన్ మూవీని సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది ‘వన్ డే’ (One Day) అనే థాయ్ సినిమాకు రీమేక్ అని సమాచారం. ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణా పురోహిత్ మూవీని నిర్మిస్తుండగా.. రామ్ సంపత్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ శుక్రవారం (జనవరి 16న) విడుదల కానుండగా, సినిమా మే 1న థియేటర్లలోకి రానుంది.
{{/usCountry}}