సౌత్ ప్రేక్షకులను తన సహజమైన నటన, డ్యాన్స్‌తో మాయ చేసిన ‘నేచురల్ బ్యూటీ’ సాయి పల్లవి.. ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. మిస్టర్ పర్ఫెక్ట్‌నిస్ట్ ఆమిర్ ఖాన్ నిర్మాణంలో, అతని కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దిన్’ (Ek Din). ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ఆసక్తి రేకెత్తించగా, తాజాగా శుక్రవారం (జనవరి 16) మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
మనసు గెలుచుకునే మ్యాజిక్..

జునైద్ ఖాన్, సాయి పల్లవి మధ్య నడిచే స్వచ్ఛమైన, మృదువైన ప్రేమకథను ఈ ఏక్ దిన్ మూవీ టీజర్‌లో చూపించారు. జునైద్ చెప్పే వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలవుతుంది. "మీరా.. నీ నవ్వు నాకు చాలా ఇష్టం. నేను నీ మనసు గెలుస్తానో లేదో తెలియదు.. కానీ, అందనంత దూరంలో ఉంటే అవి కలలు ఎలా అవుతాయి?" అని జునైద్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
మరో సీన్ లో సాయి పల్లవి మాట్లాడుతూ.. "సినిమాల్లో చాలా మ్యాజిక్ ఉంటుంది.. కానీ నిజ జీవితంలో అలా జరగదు కదా" అని నిరాశగా అంటుంది. దానికి జునైద్ బదులిస్తూ.. "జరుగుతుంది.. ఆ మాయ జరుగుతుంది" అని భరోసా ఇస్తాడు. ఈ సంభాషణలు సినిమాలోని ఫీల్ గుడ్ లవ్ స్టోరీని పరిచయం చేస్తున్నాయి.
సాయి పల్లవి హిందీకి నెటిజన్లు ఫిదా
టీజర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముఖ్యంగా సాయి పల్లవి హిందీ ఉచ్చారణపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "సాయి పల్లవి హిందీ మాట్లాడటం ఇదే తొలిసారి వింటున్నా.. ఆమె చాలా స్పష్టంగా, క్యూట్‌గా మాట్లాడుతోంది" అని ఒకరు యూట్యూబ్‌లో కామెంట్ చేశారు.
జునైద్ లుక్స్ గురించి స్పందిస్తూ.. "జునైద్ చూస్తుంటే సూపర్ మ్యాన్‌లా, హాలీవుడ్ హీరోలా ఉన్నాడు" అని మరొకరు రాసుకొచ్చారు. "జునైద్ నటన బాగుంది, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది" అని ఇంకొకరు మెచ్చుకున్నారు.
ఏక్ దిన్.. థాయ్ రీమేక్?
{{/usCountry}}జునైద్ లుక్స్ గురించి స్పందిస్తూ.. "జునైద్ చూస్తుంటే సూపర్ మ్యాన్‌లా, హాలీవుడ్ హీరోలా ఉన్నాడు" అని మరొకరు రాసుకొచ్చారు. "జునైద్ నటన బాగుంది, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది" అని ఇంకొకరు మెచ్చుకున్నారు.
ఏక్ దిన్.. థాయ్ రీమేక్?
{{/usCountry}}టీజర్ చూస్తుంటే ఇది థాయ్ సూపర్ హిట్ మూవీ ‘వన్ డే’ (One Day) రీమేక్‌లా అనిపిస్తోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్నేహ దేశాయ్, స్పందన్ మిశ్రా రచన అందించారు. మే 1, 2026న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
రామాయణం కంటే ముందే..
నిజానికి సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రామాయణం’ (Ramayana)తో జరుగుతుందని అందరూ భావించారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది. కానీ అంతకంటే ముందే ‘ఏక్ దిన్’తో ఆమె హిందీ ప్రేక్షకులను పలకరించబోతోంది. యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న రామాయణం రెండు భాగాలుగా రానుంది.