Sai Pallavi: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న భారతీయ మైథలాజికల్ విజువల్ వండర్ 'రామాయణ' (Ramayana). 'దంగల్' ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎపిక్ ప్రాజెక్ట్ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో చిత్రబృందం గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్ ను నిర్వహించింది.

ఈ రెడ్ కార్పెట్ వేడుకలో శ్రీరాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్, సీతాదేవిగా నటిస్తున్న సాయి పల్లవి, రావణాసురుడిగా నటిస్తున్న కేజీఎఫ్ స్టార్ యశ్, దర్శకుడు నితేష్ తివారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడిన సాయి పల్లవి, రామాయణ ఇతిహాసం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
"మనలోని రావణుడిని గుర్తించడమే అసలైన రామాయణం!"
లాస్ ఏంజెల్స్ ప్రదర్శనలో విదేశీ మీడియా ప్రతినిధులు సాయి పల్లవిని ప్రశ్నిస్తూ.. "భారతీయులకు రామాయణం గురించి చిన్నప్పటి నుంచే తెలుసు. కానీ అమెరికా లేదా విదేశీ ఆడియెన్స్ ఈ సినిమా ద్వారా కొత్తగా ఏం గ్రహిస్తారని మీరు భావిస్తున్నారు?" అని అడిగారు.
దానికి సాయి పల్లవి స్పందిస్తూ.. "భారతీయ సంస్కృతి, ఇతిహాసాల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే, ఇప్పటివరకు వచ్చిన రామాయణ రూపాల్లో అత్యుత్తమ దృశ్య రూపం ఈ సినిమానే అవుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక నిపుణులు, అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ (VFX) సాంకేతికతతో ఈ సినిమాను రూపొందించాం. అయితే సాంకేతికత కంటే ముఖ్యంగా ఒక పవిత్ర గ్రంథంగా రామాయణాన్ని చూస్తే.. ప్రతి ఒక్కరూ తమలోని మంచిని, చెడును ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది" అని అన్నారు.
ముఖ్యంగా రావణాసురుడి పాత్ర గురించి చెబుతూ.. “రావణుడు పూర్తిగా చెడ్డవాడేమీ కాదు. ఆయనలో ఎంతో జ్ఞానం, మంచి గుణాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో మనలో దాగి ఉన్న రావణుడిని (మనలోని చెడు ఆలోచనలను) మనం గుర్తించి, కాలక్రమేణా ఆ తప్పులను సరిదిద్దుకోవడమే అత్యంత ముఖ్యం. ఈ సినిమా చూశాక ఆ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలని కోరుకుంటున్నాను” అని సాయి పల్లవి విశ్లేషించారు.
రూ. 4000 కోట్ల వండర్: ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం
{{/usCountry}}ముఖ్యంగా రావణాసురుడి పాత్ర గురించి చెబుతూ.. “రావణుడు పూర్తిగా చెడ్డవాడేమీ కాదు. ఆయనలో ఎంతో జ్ఞానం, మంచి గుణాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో మనలో దాగి ఉన్న రావణుడిని (మనలోని చెడు ఆలోచనలను) మనం గుర్తించి, కాలక్రమేణా ఆ తప్పులను సరిదిద్దుకోవడమే అత్యంత ముఖ్యం. ఈ సినిమా చూశాక ఆ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలని కోరుకుంటున్నాను” అని సాయి పల్లవి విశ్లేషించారు.
రూ. 4000 కోట్ల వండర్: ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం
{{/usCountry}}నమిత్ మల్హోత్రా, రాకింగ్ స్టార్ యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ విజువల్ ఎపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు భాగాలు కలిపి ఏకంగా రూ. 4000 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు సమాచారం. ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ (A.R. Rahman), హన్స్ జిమ్మర్ (Hans Zimmer) కలిసి ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించడం విశేషం.
ఇందులో లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. మొదటి భాగం వచ్చే నవంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండగా, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.