...
...
Next Story

Samantha: సాయి పల్లవి, శ్రీలీలకు బ్యాడ్ లక్.. సమంత, భాగ్యశ్రీకి బ్లాక్ బస్టర్స్.. ఆ రెండు సినిమాల మిస్సింగ్ కథ

Samantha Bhagyashri: డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల టాలీవుడ్ టాప్ లీడింగ్ లేడీస్ సాయి పల్లవి, శ్రీలీల తమ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచే రెండు భారీ ప్రాజెక్ట్‌లను చేజార్చుకున్నారు. వాటిని దక్కించుకున్న సమంత రూత్ ప్రభు, భాగ్యశ్రీ బోర్సేలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించారు.

Published on: Jul 14, 2026, 05:57:48 IST
Advertisement

Samantha bhagyashri: సినిమా ఇండస్ట్రీలో ఒకరు వదులుకున్న ప్రాజెక్ట్ మరొకరి వద్దకు వెళ్లడం.. అది కాస్తా బాక్సాఫీస్ వద్ద కల్ట్ క్లాసిక్‌గానో లేదా వంద కోట్ల ఇండస్ట్రీ హిట్‌గానో మారడం కొత్తేమీ కాదు. అయితే, ఇటీవల కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్ ఈక్వేషన్స్ మార్చేసిన రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల వెనుక ఉన్న ‘కాస్టింగ్ ఛేంజెస్’ ఇప్పుడు ఫిలిం నగర్ ఇన్‌సైడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

రూ.100 కోట్ల రికార్డు

సాయి పల్లవి, శ్రీలీల వదులుకుంటే- సమంత, భాగ్యశ్రీలకు లైఫ్ ఛేంజింగ్ హిట్స్- ఆ రెండు బ్లాక్‌బస్టర్స్ మిస్సింగ్ కథ
సాయి పల్లవి, శ్రీలీల వదులుకుంటే- సమంత, భాగ్యశ్రీలకు లైఫ్ ఛేంజింగ్ హిట్స్- ఆ రెండు బ్లాక్‌బస్టర్స్ మిస్సింగ్ కథ

తెలుగు సినిమా హిస్టరీలోనే సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన ఉమెన్-సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. ఈ కథలోని పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్ కోసం డైరెక్టర్ మొదటి ఛాయిస్ సాయి పల్లవి. అయితే ఆ సమయంలో సాయి పల్లవి పాన్-ఇండియా ప్రాజెక్ట్స్ (రామాయణ్, తదితర చిత్రాలు) తో విపరీతంగా బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరస్కరించింది.

రంగంలోకి సమంత

సాయి పల్లవి రిజెక్ట్ చేసిన తర్వాత మా ఇంటి బంగారం స్క్రిప్ట్ సమంత దగ్గరకు వెళ్లింది. కేవలం నటిగా మాత్రమే కాకుండా, ఈ కథలోని కమర్షియల్ పొటెన్షియల్‌ను గుర్తించిన సమంత.. తానే స్వయంగా హోమ్ బ్యానర్‌పై దీనిని నిర్మించడానికి ముందుకొచ్చింది.

టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఏ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సాధ్యం కాని విధంగా.. ‘మా ఇంటి బంగారం’ ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ వదులుకోవడం వల్ల ఒక చరిత్రాత్మక రికార్డును మిస్ అవ్వగా.. సమంతకు మాత్రం ఇది నటిగా, నిర్మాతగా కెరీర్ బెస్ట్ కంబ్యాక్‌గా నిలిచింది.

పాపం శ్రీలీల

ఈ గ్యాప్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే.. ‘భారతి’ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి, టాలీవుడ్‌లో తన కెరీర్‌లోనే మొదటి సాలిడ్ కమర్షియల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ‘మిస్టర్ బచ్చన్’ తో మొదలు భాగ్యశ్రీకి సరైన సక్సెస్ లూప్ దొరకని తరుణంలో, శ్రీలీల వదులుకున్న ఈ ‘లెనిన్’ ఆమెను ట్రేడ్ రేసులో నిలబెట్టింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe