Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ లో డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' (Dhurandhar) ఫ్రాంచైజీ ఇండియన్ సినిమా రూపురేఖలను పూర్తిగా మార్చేసిందని ఆయన ఓపెన్ గా ఒప్పుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఏ సినిమా చూసినా ధురంధర్ కంటే ముందు, ఆ తర్వాత అనేలా ట్రెండ్ నడుస్తోందని చెప్పారు.
ఆదిత్య ధర్ మ్యూజిక్ మ్యాజిక్.. ఒక రివల్యూషన్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడిన సైఫ్ అలీ ఖాన్.. ధురంధర్ సినిమాలో వాడిన సౌండ్‌ట్రాక్, మ్యూజిక్ సిస్టమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. "ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్లంతా ఈ కొత్త ట్రెండ్ అందుకుంటారా లేదా అనేది వాళ్ల ఇష్టం. ప్రతి సినిమాకు ఒక కొత్త ఆల్బమ్ క్రియేట్ చేయడం కంటే, గ్లోబల్ వైడ్ ఉన్న బెస్ట్ మ్యూజిక్ ఇన్‌ఫ్లుయెన్స్ ను వాడుకోవడం చాలా మంచి ఐడియా" అని సైఫ్ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ లో ఇంగ్లీష్ ను, వెస్ట్రన్ బీట్స్ ను వాడటానికి మేకర్స్ అస్సలు భయపడలేదని ప్రశంసించారు.
ఒరిజినల్స్ తోపాటు రీమిక్స్
ఈ ధురంధర్ సినిమాలకు శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన మ్యూజిక్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఒరిజినల్ సాంగ్స్ తో పాటు పాత క్లాసిక్స్ ను రీమిక్స్ చేసిన విధానం ఆడియన్స్ కు ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఆయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా డాన్స్ చేసిన 'షరారత్' సాంగ్ గురించి సైఫ్ స్పెషల్ గా మాట్లాడారు.
సినిమాలో ఐటెం సాంగ్స్ కోసం సపరేట్ గా హీరోయిన్ ను పెట్టే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ను ఈ సాంగ్ బ్రేక్ చేసిందని, పెళ్లి వేడుకలో నాచురల్ గా వచ్చే డ్యాన్స్ లా దీన్ని ప్రెజెంట్ చేయడం విప్లవాత్మకమైన మార్పు అని ఆయన కొనియాడారు.
3100 కోట్ల బాక్సాఫీస్ విధ్వంసం.. వరల్డ్ రికార్డ్స్
{{/usCountry}}సినిమాలో ఐటెం సాంగ్స్ కోసం సపరేట్ గా హీరోయిన్ ను పెట్టే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ను ఈ సాంగ్ బ్రేక్ చేసిందని, పెళ్లి వేడుకలో నాచురల్ గా వచ్చే డ్యాన్స్ లా దీన్ని ప్రెజెంట్ చేయడం విప్లవాత్మకమైన మార్పు అని ఆయన కొనియాడారు.
3100 కోట్ల బాక్సాఫీస్ విధ్వంసం.. వరల్డ్ రికార్డ్స్
{{/usCountry}}డిసెంబర్ 2025 లో వచ్చిన ఫస్ట్ పార్ట్, ఆ తర్వాత మార్చి 2026 లో రిలీజైన సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ దగ్గర భారీ విధ్వంసం సృష్టించాయి. ఈ రెండు సినిమాలు కలిపి గ్లోబల్ వైడ్ గా ఏకంగా రూ. 3100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డులు తిరగరాశాయి. అందులోనూ ధురంధర్ 2 ఇండియన్ సినిమా హిస్టరీలోనే సెకండ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలిచి సంచలనం క్రియేట్ చేసింది.
రణ్‌వీర్ సింగ్ కెరీర్ లోనే ఇదొక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఈ భారీ యాక్షన్ డ్రామాలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడి, సారా అర్జున్ లాంటి నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న స్టార్ కాస్ట్ నటించారు. ఈ సినిమా సక్సెస్ తో బాలీవుడ్ మేకర్స్ అందరూ ఇప్పుడు కంటెంట్ ఆధారిత భారీ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు.
సైఫ్ అలీ ఖాన్ నెక్స్ట్ క్రేజీ లైనప్
ఇక సైఫ్ అలీ ఖాన్ రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన క్రైమ్ థ్రిల్లర్ 'కర్తవ్య' (Kartavya) తో డిజిటల్ ఆడియన్స్ ను అలరించాడు. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా సైఫ్ పెర్ఫార్మెన్స్ కు క్రిటిక్స్ నుంచి సాలిడ్ అప్రిషియేషన్ దక్కింది. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
పీరియడ్ డ్రామా 'హమ్ హిందుస్తానీ' షూటింగ్ లో బిజీగా ఉన్న సైఫ్.. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న 'హైవాన్' (Haiwaan) మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్స్ లో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.