Sairabanu: టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్, బంధవి శ్రీధర్ (Bandhavi Sridhar) జంటగా నటిస్తున్న సినిమా 'సైరాబాను'. ఇవాళ (ఆగస్టు 15) ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన నిమిషాల్లోనే డిజిటల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న సందర్భంగా విడుదల చేసిన ఫన్నీ బీటీఎస్ (BTS) వీడియో సినిమాపై ఆసక్తిని రేపగా, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా స్టోరీపై ఓ క్లారిటీనిచ్చింది.
హిందూ, ముస్లిం ప్రేమ

శనివారం రిలీజ్ చేసిన సైరాబాను మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బైక్ నడుపుతున్న హిందూ యువకుడిగా ఆది సాయికుమార్, అతని వెనుక సాంప్రదాయ ముస్లిం దుస్తుల్లో కూర్చున్న యువతిగా బంధవి శ్రీధర్ కనిపించిన ఈ పిక్చర్ సినిమా మూడ్‌ను స్పష్టం చేస్తోంది. ఇద్దరి మధ్య నడిచే ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీకి కీలకం కానుంది.
ఎంటర్ టైన్మెంట్ గ్యారంటీ
‘‘ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు సైరాబాను వచ్చేస్తుంది. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ప్రతి హద్దును దాటేసి ప్రేమ ఎగరాలి’’ అని ఆది సాయికుమార్ సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ను పంచుకున్నాడు. ఈ పోస్టర్లో ఓ వైపు గుడి, మరోవైపు మసీద్ కూడా కనిపిస్తోంది.
షూటింగ్ స్పీడ్
'సామజవరగమన' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా ఈ సైరాబాను చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
‘శంభాల’తో కంబ్యాక్
{{/usCountry}}'సామజవరగమన' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా ఈ సైరాబాను చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
‘శంభాల’తో కంబ్యాక్
{{/usCountry}}చాలా కాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేసిన ఆది సాయికుమార్ కు శంభాలతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. శంభాల మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధించి, ఆది సాయికుమార్ మార్కెట్‌ను ఒక్కసారిగా పెంచేసింది. ఆ ఘన విజయం తర్వాత ఆది నటిస్తున్న మొదటి సినిమా కావడంతో 'సైరాబాను'పై ట్రేడ్ వర్గాల్లో మంచి బిజినెస్ అంచనాలు ఏర్పడ్డాయి.
రొటీన్ మాస్/యాక్షన్ సినిమాల జోలికి పోకుండా 'శంభాల' తర్వాత అంతకంటే భిన్నమైన, బలమైన భావోద్వేగాలు ఉన్న కథను ఎంచుకోవడంలో ఆది మార్క్ స్ట్రాటజీ కనిపిస్తోందని చెప్పొచ్చు.
యూత్ అండ్ ఫ్యామిలీ కనెక్ట్
హిందూ-ముస్లిం ప్రేమకథా చిత్రాలకు సౌత్ ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ప్రేమకథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే అవకాశం ఉంది.
శంభాల విజయం తెచ్చిన ఊపును కాపాడుకోవడానికి ఆది సాయికుమార్ ‘సైరాబాను’ రూపంలో ఒక వినూత్నమైన రొమాంటిక్ డ్రామాను ఎంచుకున్నాడు. రాజేష్ దండా మేకింగ్ స్టాండర్డ్స్, ఆది కంబ్యాక్ క్రేజ్ తోడవ్వడం ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను భారీగా పెంచడంలో కీలకంగా మారనుంది.