బాలీవుడ్ యంగ్ హీరో అహాన్ పాండే మంగళవారం అంటే డిసెంబర్ 23న తన 28వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తన తొలి మూవీ 'సయ్యారా' (Saiyaara) కోసం అతడు చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాక్‌స్టార్ లుక్ కోసం రోజుకు 30 గుడ్లు తినడం దగ్గర నుంచి కఠినమైన వర్కౌట్స్ వరకు అహాన్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.
తొలి సినిమా కోసమే ఈ స్థాయిలో..

యువ నటుడు అహాన్ పాండే తన డెబ్యూ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బొద్దుగా ఉన్న అహాన్.. కేవలం 40-45 రోజుల్లోనే సిక్స్ ప్యాక్ బాడీతో రాక్‌స్టార్‌లా మారిపోయారు. ఈ క్రెడిట్ అంతా వాళ్ళ అమ్మ, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ డీన్ పాండే (Deanne Panday), ట్రైనర్ అజర్ జహీర్ షేక్‌లదే.
అహాన్ తల్లి డీన్ పాండే ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణురాలు. బిపాసా బసు, జాన్ అబ్రహం వంటి స్టార్లకు ఆమె ట్రైనింగ్ ఇచ్చింది. అహాన్ డైట్ విషయంలో ఆమె చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరించింది.
రోజుకు 30 గుడ్లు
సయ్యారా మూవీ షూటింగ్ కోసం చివరి మూడు నెలలు అహాన్ కేవలం తన కోసం ప్రత్యేకంగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకున్నాడు. కండలు పెంచడానికి అహాన్ రోజుకు 30 గుడ్లు తినేవాడట. "మజిల్ రావాలంటే రోజుకు 30 గుడ్లు తినాల్సిందే.. షార్ట్ కట్స్ లేవు" అని ట్రైనర్ అజర్ తెలిపాడు.
బ్రేక్‌ఫాస్ట్ లో భాగంగా గుడ్లు, ఓట్స్, అవకాడో.. ఇక లంచ్ లో గ్రిల్డ్ చికెన్, బ్రౌన్ రైస్, కూరగాయలు.. డిన్నర్ లో సూప్ లేదా సాలడ్. డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ షేక్స్ కూడా తీసుకునేవాడు.
45 రోజుల్లో 9 కిలోలు తగ్గి..
ట్రైనింగ్ మొదలుపెట్టే సమయానికి అహాన్ కాస్త లావుగా ఉండేవాడు. కానీ 45 రోజుల్లోనే 8-9 కిలోల బరువు తగ్గి చాలా సన్నగా మారిపోయాడు. డైట్ తోపాటు రోజుకు 2 గంటల పాటు కఠినమైన సాధన చేసేవాడు.
{{/usCountry}}ట్రైనింగ్ మొదలుపెట్టే సమయానికి అహాన్ కాస్త లావుగా ఉండేవాడు. కానీ 45 రోజుల్లోనే 8-9 కిలోల బరువు తగ్గి చాలా సన్నగా మారిపోయాడు. డైట్ తోపాటు రోజుకు 2 గంటల పాటు కఠినమైన సాధన చేసేవాడు.
{{/usCountry}}వెయిట్ ట్రైనింగ్, యోగా, బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, పిలేట్స్ ఇలా అన్నీ కలిపి చేసేవాడు. షూటింగ్ షెడ్యూల్స్ వల్ల కొన్నిసార్లు తెల్లవారుజామున 4 గంటలకే జిమ్‌కు వెళ్లేవాడు. షూటింగ్ గ్యాప్స్‌లో సెట్‌లోనే వర్కౌట్ చేసేవాడు.
కండరాలు రిపేర్ అవ్వాలంటే రోజుకు 7-9 గంటల నిద్ర అవసరం. కానీ బిజీ షెడ్యూల్ వల్ల అహాన్‌కు నిద్ర సరిపోయేది కాదు. అయినా సరే క్యారవాన్‌లోనో, కారులోనో దొరికిన కాసేపు నిద్రపోతూ మేనేజ్ చేశాడు. డీహైడ్రేషన్ బారిన పడకుండా రోజుకు 4 లీటర్ల నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ తీసుకునేవాడు. అతని ఫిట్‌నెస్ జర్నీ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా చెప్పొచ్చు.