Sai Pallavi: సీతతో ఫైట్లు చేయించడమేంటి.. సిగ్గుండాలి.. ఆ దమ్ముందా: రామాయణపై ‘శక్తిమాన్’ ముకేశ్ ఖన్నా షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: 'రామాయణం' సినిమాపై ప్రముఖ నటుడు ముకేష్ ఖన్నా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సినిమాలో సీతాదేవి పాత్రకు ఫైట్ సీక్వెన్స్ పెట్టడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. మేకర్స్ క్రియేటివ్ లిబర్టీ పేరుతో సనాతన ధర్మ గ్రంథాలను మారుస్తున్నారని మండిపడ్డారు.

Published on: Nov 10, 2026, 14:46:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sai Pallavi: రామాయణ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొడుతోంది. ఈ మూవీకి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండగా, మరోవైపు బీఆర్ చోప్రా 'మహాభారత్'లో భీష్ముడి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు ముకేష్ ఖన్నా ఈ చిత్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేసిన ముకేష్ ఖన్నా.. సినిమా మేకర్స్ అనుసరించిన తీరును, కథలో చేసిన మార్పులను తప్పుబట్టారు.

Sai Pallavi: సీతతో ఫైట్లు చేయించడమేంటి.. సిగ్గుండాలి: రామాయణ మూవీపై ‘శక్తిమాన్’ ముకేశ్ ఖన్నా షాకింగ్ కామెంట్స్ (hindustan)
Sai Pallavi: సీతతో ఫైట్లు చేయించడమేంటి.. సిగ్గుండాలి: రామాయణ మూవీపై ‘శక్తిమాన్’ ముకేశ్ ఖన్నా షాకింగ్ కామెంట్స్ (hindustan)

“రూ.4000 కోట్లు ఎలా రాబట్టాలనేదే మేకర్స్ ధ్యేయం”

ముకేష్ ఖన్నా మాట్లాడుతూ.. "రామాయణం సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ కలెక్షన్లపైనే చర్చ జరుగుతోంది. రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను ఎలాగైనా బిజినెస్ పరంగా విజయవంతం చేసుకోవాలనే తపన మేకర్స్‌లో కనిపిస్తోంది తప్ప.. పౌరాణిక మూలాలను కాపాడే ప్రయత్నం కనిపించడం లేదు. నేను ఇంకా ఈ సినిమా చూడలేదు.. కానీ గత 5-6 రోజులుగా వస్తున్న రివ్యూలు, ప్రోమోలు చూశాక నాకు ఈ సినిమా చూడకూడదనిపించింది. నేను థియేటర్‌కు వెళ్లి టికెట్లు కొని నిర్మాతలకు లాభం చేకూర్చాలనుకోవడం లేదు" అని వ్యాఖ్యానించారు.

సీతాదేవి యాక్షన్ సీన్‌పై మండిపడ్డ ముకేష్ ఖన్నా

సినిమాలో సాయి పల్లవి పోషించిన సీతాదేవి పాత్రతో ఫైట్ సీక్వెన్సులు చేయించడంపై ముకేష్ ఖన్నా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "వాల్మీకి రామాయణంలో సీతాదేవి యుద్ధాలు చేసినట్లు ఎక్కడా లేదు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి భార్యగా ఆమె ఏ తప్పూ చేయకపోయినా 14 ఏళ్లు భర్తతో కలిసి వనవాసానికి వెళ్లిన సాధ్వి. అలాంటి పవిత్ర పాత్రను ఫైటర్‌గా ఎలా చూపిస్తారు?" అని ప్రశ్నించారు.

"ఒకవేళ సీతాదేవే ఫైటర్ అయితే, రావణాసురుడు ఆమెను అపహరించి తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు పోరాడలేదు? రావణుడిని ఎందుకు ఎదురించలేదు?" అని నిలదీశారు. "మేకర్స్ విచిత్రంగా 'అద్భుత రామాయణం' ఆధారంగా ఈ సీన్ తీశామని చెబుతున్నారు. నేను మేకర్స్‌ను ఒక్కటే అడుగుతున్నా.. ఖురాన్ లేదా బైబిల్‌లోని అంశాలతో ఇలాంటి స్వేచ్ఛ తీసుకునే ధైర్యం మీకు ఉందా? మన రామాయణంతోనే ఎందుకు ఈ ప్రయోగాలు? మీకు నిజంగా సిగ్గుండాలి" అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

యశ్ రావణాసురుడి ఎలివేషన్లు, అనుపమ్ ఖేర్‌పై ట్విస్ట్

సినిమాలో రణబీర్ కపూర్ కంటే రావణాసురుడిగా నటించిన యశ్ కే ఎక్కువ ప్రశంసలు రావడంపైనా ముకేష్ ఖన్నా స్పందించారు. యశ్ నటనను అందరూ మెచ్చుకోవడానికి కారణం ఆయన నటన మాత్రమే కాదు, స్క్రిప్ట్‌లో రావణాసురుడి పాత్రను శ్రీరాముడి కంటే ఎక్కువ ఎలివేట్ చేస్తూ రాసుకోవడమే అని అభిప్రాయపడ్డారు.

ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాను ఆకాశానికెత్తడంపై స్పందిస్తూ.. "అంత పెద్ద నటుడు ఈ సినిమాను అంతగా ఎందుకు పొగుడుతున్నాడో మొదట నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత తెలిసింది ఏమిటంటే.. సినిమాలో 'జటాయువు' పాత్రకు అనుపమ్ ఖేర్ డబ్బింగ్ చెప్పారు. అందుకే ఆయన అంతగా పొగుడుతున్నారు. అందుకే ఆయన రివ్యూను నేను అస్సలు పరిగణనలోకి తీసుకోను" అని తేల్చి చెప్పారు.

పౌరాణిక కావ్యాలను వెండితెరపై ఆవిష్కరించేటప్పుడు భక్తి భావం, సాంప్రదాయ పరిమితులు పాటించాలని, కేవలం విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్సుల కోసం మూల కథను మార్చడం సరైంది కాదని ముకేష్ ఖన్నా వ్యాఖ్యానించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More