...
...
Next Story

ధోనీ నుంచి రకుల్ ప్రీత్ వరకు.. సల్మాన్ ఖాన్ 60వ పుట్టిన రోజుకు తరలి వచ్చిన సెలబ్రిటీలు.. మాజీ గర్ల్‌ఫ్రెండ్ కూడా..

సల్మాన్ ఖాన్ శనివారం (డిసెంబర్ 27) తన 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అయితే ఒక రోజు ముందే జరిగిన సెలబ్రేషన్స్ కు ధోనీ నుంచి రకుల్ ప్రీత్ వరకు ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Published on: Dec 27, 2025, 07:52:33 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ శనివారం (డిసెంబర్ 27) తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ మైలురాయిని సెలబ్రేట్ చేసుకోవడానికి పన్వేల్ ఫామ్‌హౌస్‌లో డిసెంబర్ 26 రాత్రి నుంచే గ్రాండ్ పార్టీ మొదలైంది. ఈ పార్టీకి టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

సల్మాన్ ఖాన్ బర్త్ డే సెలబ్రేషన్స్

ధోనీ నుంచి రకుల్ ప్రీత్ వరకు.. సల్మాన్ ఖాన్ 60వ పుట్టిన రోజుకు తరలి వచ్చిన సెలబ్రిటీలు.. మాజీ గర్ల్‌ఫ్రెండ్ కూడా..
ధోనీ నుంచి రకుల్ ప్రీత్ వరకు.. సల్మాన్ ఖాన్ 60వ పుట్టిన రోజుకు తరలి వచ్చిన సెలబ్రిటీలు.. మాజీ గర్ల్‌ఫ్రెండ్ కూడా..

సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లోని మిగతా ఇద్దరు ఖాన్‌లలాగే 2025లోనే తన 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఇప్పటికే షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ కూడా తమ షష్టిపూర్తి జరుపుకున్న విషయం తెలిసిందే. శనివారం (డిసెంబర్ 27) సల్మాన్ కూడా తన 60వ పడిలో అడుగుపెట్టాడు.

సాధారణంగా తన పుట్టినరోజును ముంబై అపార్ట్‌మెంట్‌లో లేదా పన్వేల్ ఫామ్‌హౌస్‌లో జరుపుకునే సల్మాన్.. ఈసారి 60వ పుట్టినరోజు కావడంతో ఫామ్‌హౌస్‌లో భారీ ఏర్పాట్లు చేశారు.

పార్టీకి ఎవరెవరు వచ్చారంటే?

సల్మాన్ బర్త్ డే పార్టీకి టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని తన భార్య సాక్షితో కలిసి పార్టీకి వచ్చాడు. ఇక టాలీవుడ్, బాలీవుడ్ భామలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా వచ్చి సందడి చేశారు. జెనీలియా దేశ్‌ముఖ్ తన పిల్లలతో రాగా, హుమా ఖురేషి గ్లామరస్ లుక్‌లో మెరిసింది. సింగర్ మికా సింగ్ వెరైటీగా స్కూటీ మీద వచ్చి ఎంట్రీ ఇచ్చాడు.

సల్మాన్‌కు అత్యంత సన్నిహితుడైన మనీష్ పాల్, మాజీ ప్రేమికురాలు సంగీతా బిజ్లానీ కూడా రావడం విశేషం. నటుడు రణదీప్ హుడా తన నిండు గర్భిణి భార్య లిన్‌తో కలిసి వచ్చాడు. సీనియర్ నటి టబు, నిర్మాత రమేష్ తౌరానీ, నిఖిల్ ద్వివేది, మహేష్ మంజ్రేకర్ కూడా పార్టీలో మెరిశారు.

ఖాన్ ఫ్యామిలీ సందడి

ఈ పార్టీలో సల్మాన్ కోసం ఒక ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. సల్మాన్‌తో పనిచేసిన దర్శకులందరూ ఇందులో ఆయనకు విషెస్ చెప్పినట్లు సమాచారం. పుట్టినరోజు కానుకగా అభిమానులకు ఒక శుభవార్త అందనుంది. సల్మాన్ నటిస్తున్న 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' సినిమా నుంచి ఒక భారీ అప్‌డేట్ ఇవ్వబోతున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe