ఈ డిజాస్టర్ సినిమాను ఏకంగా 30 మంది యాక్టర్స్ వద్దన్నారు.. ఎయిడ్స్ పేషెంట్‌గా సల్మాన్ ఖాన్.. తెలుగు నటే డైరెక్టర్

సల్మాన్ ఖాన్ నటించిన ఒక సినిమాను అప్పట్లో 30 మంది నటులు తిరస్కరించారు. ఎయిడ్స్ రోగిగా సల్మాన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. తెలుగులో హీరోయిన్ గా చేసిన రేవతి ఈ మూవీని డైరెక్ట్ చేయడం విశేషం.

Published on: Jan 29, 2026, 20:12:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలను ఎవరూ వదులుకోరు. కానీ సల్మాన్ ఖాన్ నటించిన ఒక సినిమాను మాత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా 30 మంది నటులు రిజెక్ట్ చేశారు. 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఇందులో సల్మాన్‌తో పాటు ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా నటించారు. అయితే వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించరు. ఈ సినిమాలో సల్మాన్ పాత్ర చివరికి చనిపోతుంది.

ఈ డిజాస్టర్ సినిమాను ఏకంగా 30 మంది యాక్టర్స్ వద్దన్నారు.. ఎయిడ్స్ పేషెంట్‌గా సల్మాన్ ఖాన్.. తెలుగు నటే డైరెక్టర్ (Instagram)
ఈ డిజాస్టర్ సినిమాను ఏకంగా 30 మంది యాక్టర్స్ వద్దన్నారు.. ఎయిడ్స్ పేషెంట్‌గా సల్మాన్ ఖాన్.. తెలుగు నటే డైరెక్టర్ (Instagram)

ఆ సినిమా పేరేంటో తెలుసా?

సల్మాన్ ఖాన్ ఓ ఎయిడ్స్ పేషెంట్ లా కనిపించిన ఆ సినిమా పేరు ‘ఫిర్ మిలేంగే’ (Phir Milenge). 2004లో బ్లాక్ బస్టర్ సినిమా ‘ధూమ్’ విడుదలైన సమయంలోనే ఇది కూడా విడుదలైంది. ఇందులో సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్‌లతో పాటు శిల్పా శెట్టి ప్రధాన పాత్రలో నటించింది.

ఎయిడ్స్ పేషెంట్‌గా సల్మాన్..

‘ఫిర్ మిలేంగే’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక ఎయిడ్స్ రోగిగా నటించడం గమనార్హం. ఆ సమయంలో ఏ నటుడు కూడా ఎయిడ్స్ రోగి పాత్రలో నటించడానికి ఇష్టపడలేదు. అందుకే ఈ సినిమాను చాలా మంది నటులు తిరస్కరించారు. చివరగా సల్మాన్ ఖాన్ ఈ సాహసోపేతమైన పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు.

సల్మాన్ ఖాన్ స్నేహితుడు, ఈ మూవీ నిర్మాత శైలేంద్ర సింగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. "ఈ సినిమాను 30 మంది నటులు తిరస్కరించారు. ఆ తర్వాతే ఈ కథ సల్మాన్ దగ్గరకు చేరింది" అని అతడు చెప్పాడు.

రేవతి దర్శకత్వంలో..

ప్రముఖ నటి రేవతి ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. ఆమె ఇండస్ట్రీలోని దాదాపు 30 మంది నటులను సంప్రదించారు. ఈ సినిమాను తిరస్కరించిన చివరి నటుడు ఉదయ్ చోప్రా అని నిర్మాత తెలిపాడు. ఎవరూ ఒప్పుకోకపోయేసరికి రేవతి నిరాశ చెంది.. "డబ్బులు వెనక్కి తీసుకోండి, నేను ఈ సినిమాను వదిలేస్తున్నాను" అని నిర్మాతతో అన్నదట. ఆ క్లిష్ట సమయంలో సల్మాన్ ఖాన్ సినిమా చేయడానికి ముందుకొచ్చాడు.

బాక్సాఫీస్ డిజాస్టర్..

కథ పరంగా ప్రశంసలు దక్కినా, వసూళ్ల పరంగా ‘ఫిర్ మిలేంగే’ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమా బడ్జెట్ రూ. 5.50 కోట్లు కాగా.. వసూళ్లు మాత్రం కేవలం రూ. 3.65 కోట్లు మాత్రమే. బాక్సాఫీస్ ఇండియా నివేదిక ప్రకారం ఈ సినిమా నష్టాలను చవిచూసింది. దీని ఐఎండీబీ రేటింగ్ 6.2గా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More