...
...
Next Story

Maatrubhumi: సల్మాన్ ఖాన్ సినిమాకు కొత్త టైటిల్.. వరుస వివాదాలతో మేకర్స్ నిర్ణయం.. మాతృభూమిగా మార్పు

Maatrubhumi: సల్మాన్ ఖాన్ నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ మూవీ టైటిల్ ను మేకర్స్ మార్చారు. వరుస వివాదాల నేపథ్యంలో ఈ సినిమాకు మాతృభూమి అని కొత్త టైటిల్ పెడుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. మే వార్ రెస్ట్ ఇన్ పీస్ అనే ట్యాగ్ లైన్ దీనికి ఉంచారు.

Published on: Mar 16, 2026, 13:59:44 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా పేరును అధికారికంగా 'మాతృభూమి' (Maatrubhumi) గా మార్చుతున్నట్లు సోమవారం (మార్చి 16) అనౌన్స్ చేశాడు. గతంలో ఈ సినిమాకు 'బాటిల్ ఆఫ్ గల్వాన్' (Battle of Galwan) అనే పేరు ఉండేది. ఈ సినిమాపై చైనా నుండి వ్యక్తమైన తీవ్ర అభ్యంతరాలు, వివాదాల మధ్య ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం.

సల్మాన్ ఖాన్ సినిమా పేరు మార్పు

Maatrubhumi: సల్మాన్ ఖాన్ సినిమాకు కొత్త టైటిల్.. వరుస వివాదాలతో మేకర్స్ నిర్ణయం.. మాతృభూమిగా మార్పు (SK Films)
Maatrubhumi: సల్మాన్ ఖాన్ సినిమాకు కొత్త టైటిల్.. వరుస వివాదాలతో మేకర్స్ నిర్ణయం.. మాతృభూమిగా మార్పు (SK Films)

సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ.. సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో ఇలా రాశాడు. “మే వార్ రెస్ట్ ఇన్ పీస్ (May War Rest In Peace). #Maatrubhumi.” అంటూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశాడు.

ఈ పోస్టర్‌లో సల్మాన్ ఖాన్ యుద్ధ క్షేత్రంలో గాయపడిన ఒక సైనికుడిగా కనిపిస్తున్నాడు. అతని ముఖం మొత్తం రక్తం, మట్టి, గాయాలతో నిండి ఉండి సినిమా తీవ్రతను తెలియజేస్తోంది. నుదుటిపై లోతైన గాయం, ముఖంపై కమిలిన గుర్తులు కనిపిస్తున్నాయి.

ఇంటెన్స్ లుక్స్ తో నేరుగా కెమెరా వైపు చూస్తున్న సల్మాన్, ముళ్ల తీగ చుట్టిన ఒక ఆయుధాన్ని రక్తంతో నిండిన చేతితో గట్టిగా పట్టుకుని ఉన్నాడు. దుమ్ముతో నిండిన బ్యాక్‌గ్రౌండ్‌లో ఇతర సైనికుల నీడలు మసకగా కనిపిస్తున్నాయి. అంతకుముందే ఈ సినిమా నుండి అరిజీత్ సింగ్ పాడిన 'మాతృభూమి' అనే పాట విడుదలై మంచి గుర్తింపు పొందింది.

మాతృభూమి మూవీ నేపథ్యం

దర్శకుడు అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా రూపొందుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో నటిస్తున్నాడు. 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన సంతోష్ బాబు.. మరో 19 మంది సైనికులతో కలిసి భారత భూభాగాన్ని కాపాడుతూ వీరమరణం పొందారు. ఆయన త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం మరణానంతరం రెండో అత్యున్నత యుద్ధ పురస్కారం ‘మహావీర చక్ర’తో గౌరవించింది.

టైటిల్‌పై చైనా అభ్యంతరం

ఆ టీజర్‌లో సల్మాన్ ఖాన్ నేతృత్వంలోని భారత సైనికుల బృందం చైనా పీఎల్‌ఏ (PLA) సైన్యంపైకి దూసుకెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో 'మేరా భారత్ దేశ్ మహాన్ హై' అనే పాట వినిపిస్తుంది. టీజర్‌లో సల్మాన్ ఖాన్ చెప్పే వాయిస్ ఓవర్.. "సైనికులారా గుర్తుంచుకోండి, మీకు గాయమైతే దాన్ని ఒక మెడల్‌లా భావించండి, ఒకవేళ మరణం కనిపిస్తే దానికి సెల్యూట్ చేయండి" అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఇప్పటికే 6 కోట్ల వ్యూస్‌ను సాధించింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe