బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ హాస్పిటల్లో చేరారు. సీనియర్ స్క్రీన్ రైటర్ అయిన సలీమ్ ఖాన్ ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న సలీమ్ పరిస్థితి సీరియస్ గానే ఉందని తెలిసింది. షూటింగ్ మధ్యలో నుంచి వచ్చిన సల్మాన్ హాస్పిటల్ లోనే ఉన్నాడు.
హాస్పిటల్లో సల్మాన్ ఖాన్

ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు స్టోరీ, డైలాగ్ లు అందించిన సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నారు. 90 ఏళ్ల ఆయనకు ముంబయిలోని లీలావతి హాస్పిటల్లో సర్జరీ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న తండ్రి కోసం సల్మాన్ ఖాన్ హాస్పిటల్లోనే ఉన్నాడు. హాస్పిటల్లో సల్మాన్ టెన్షన్ పడుతూ కనిపించాడు. హెలెన్, అల్విరా అగ్నిహోత్రి, ఆయాన్ అగ్నిహోత్రి, అర్హాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, షురా ఖాన్ తదితర కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ లోనే ఉన్నారు.
సల్మాన్ ఎక్స్ లవర్
సలీమ్ ఖాన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిసి సల్మాన్ ఖాన్ ఎక్స్ లవర్ సోమీ అలీ షాక్ అయింది. సలీమ్ త్వరగా కోలుకోవాలని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది.
‘‘సలీమ్ ఖాన్ ఆసుపత్రిలో చేరారని వినగానే నా గుండె తరుక్కుపోయింది. ప్రపంచానికి ఆయన లెజెండరీ రచయిత. అమితాబ్ బచ్చన్ వంటి వారిని తీర్చిదిద్దారు. 'షోలే' వంటి కళాఖండాలను సృష్టించారు. నాకు ఆయన తండ్రిలాంటివారు. ఆయన ఇంట్లో నివసించినప్పుడు నన్ను కూతురిలా చూసుకున్నారు. అందరితో పాటు భోజనం చేసేవారు’’ అని సోమీ అలీ రాసుకొచ్చింది.
చెప్పలేనంత ఎక్కువ
‘‘నమ్మకం గురించి ఆయన ఎప్పుడూ లోతైన సంభాషణలు చేసేవారు. అన్ని మతాలను గౌరవించి, సంబరాలు చేసుకునేవారు. సిద్ధాంతాల కంటే దేవుడు గొప్పవాడని చెప్పేవారు. మూవీ స్టోరీల్లో డ్రామా కింద కచ్చితంగా నిజం ఉండాలనేవారు. ఆయన ప్రతిభ సినిమా చరిత్రను నిర్మించింది. ఆయన మానవత్వం మనుషులను నిర్మించింది. ఆయన బలంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఆయన నాకు ఎంత ఎక్కువో మాటల్లో చెప్పలేను’’ అని సోమీ అలీ తన పోస్ట్ లో పేర్కొంది.
{{/usCountry}}‘‘నమ్మకం గురించి ఆయన ఎప్పుడూ లోతైన సంభాషణలు చేసేవారు. అన్ని మతాలను గౌరవించి, సంబరాలు చేసుకునేవారు. సిద్ధాంతాల కంటే దేవుడు గొప్పవాడని చెప్పేవారు. మూవీ స్టోరీల్లో డ్రామా కింద కచ్చితంగా నిజం ఉండాలనేవారు. ఆయన ప్రతిభ సినిమా చరిత్రను నిర్మించింది. ఆయన మానవత్వం మనుషులను నిర్మించింది. ఆయన బలంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఆయన నాకు ఎంత ఎక్కువో మాటల్లో చెప్పలేను’’ అని సోమీ అలీ తన పోస్ట్ లో పేర్కొంది.
{{/usCountry}}సలీమ్ ఖాన్ గురించి
సలీమ్ ఖాన్ తన దీర్ఘకాల సహచరుడు జావేద్ అఖ్తర్‌తో కలిసి సలీమ్-జావేద్ అనే దిగ్గజ స్క్రీన్ రైటింగ్ ద్వయంగా ఏర్పడ్డారు. వీరిద్దరూ కలిసి 'షోలే', 'డాన్', 'జంజీర్', 'దీవార్', 'త్రిశూల్', 'యాదోన్ కి బారాత్', 'సీతా ఔర్ గీత' వంటి హిందీ సినిమా అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో కొన్నింటిని రచించారు. 1970లలో అమితాబ్ బచ్చన్ 'యాంగ్రీ యంగ్ మాన్' ఇమేజ్‌ను తీర్చిదిద్దడంలో వీరి రచనలు కీలక పాత్ర పోషించాయి. 2024లో సలీమ్-జావేద్ ల ప్రయాణం ఆధారంగా 'యాంగ్రీ యంగ్ మెన్' అనే డాక్యుమెంటరీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది.