The Monster: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి సంబంధించిన సంచలన అప్‌డేట్ బయటికొచ్చింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మేకర్స్ ‘ది మాన్‌స్టర్’ (The Monster) అనే క్రేజీ టైటిల్‌ను లాక్ చేశారు.

ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ ప్రొడక్షన్ వర్గాల్లో ఈ టైటిల్ దాదాపు ఖాయమైపోయింది. సల్మాన్ ఖాన్ సరసన సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈద్ 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
వంశీ పైడిపల్లి బాలీవుడ్ ఎంట్రీ.. భారీ స్కేల్‌లో మాస్ యాక్షన్
టాలీవుడ్‌లో 'బృందావనం', 'ఎవడు', నాగార్జున-కార్తీల 'ఊపిరి', మహేష్ బాబుతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ 'మహర్షి', విజయ్‌తో 'వారిసు' లాంటి బ్లాక్‌బస్టర్లు తీసిన వంశీ పైడిపల్లికి ఇది మొదటి హిందీ సినిమా. సౌత్ అండ్ నార్త్ ఆడియెన్స్ మైండ్ సెట్‌ను పర్ఫెక్ట్‌గా రీడ్ చేయగల ఆయన.. ఈ సినిమాను పూర్తి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో డిజైన్ చేస్తున్నారు.
మరోవైపు ప్రొడ్యూసర్ దిల్ రాజు సౌత్ నుంచి పాన్ ఇండియా మార్కెట్‌లోకి రీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తన పరిధిని విస్తరిస్తున్నారు. గ్లోబల్ వైడ్‌గా భారీ స్థాయిలో బిజినెస్ రీచ్ సాధించాలనే టార్గెట్‌తో ఈ 'ది మాన్‌స్టర్' ప్రాజెక్ట్‌పై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించనున్నారు.
సల్మాన్ ఖాన్ - నయనతార కాంబో.. 'జవాన్' క్రేజ్ రిపీట్?
సల్మాన్ ఖాన్‌కి ఈద్ సీజన్ ఎంత స్పెషల్ అనేది వేరే చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్‌లోని అతిపెద్ద హిట్స్ అన్నీ ఈద్ పండుగకే బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ‘సికందర్’ తర్వాత సల్మాన్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాపై బాలీవుడ్ వర్గాల్లో మైండ్ బ్లాకింగ్ అంచనాలు ఉన్నాయి.
{{/usCountry}}సల్మాన్ ఖాన్‌కి ఈద్ సీజన్ ఎంత స్పెషల్ అనేది వేరే చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్‌లోని అతిపెద్ద హిట్స్ అన్నీ ఈద్ పండుగకే బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ‘సికందర్’ తర్వాత సల్మాన్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాపై బాలీవుడ్ వర్గాల్లో మైండ్ బ్లాకింగ్ అంచనాలు ఉన్నాయి.
{{/usCountry}}షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీతో ఆల్రెడీ నార్త్‌లో జెండా పాతేసిన నయనతార.. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి జోడీ కడుతుండటంతో అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్‌లో ఈ కాంబో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో సల్మాన్ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా, డార్క్ షేడ్స్‌తో ఉండబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా శరవేగంగా జరుగుతోంది. టైటిల్ ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్‌ను త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈద్ 2027 నాటికి బాక్సాఫీస్ వద్ద ఈ 'మాన్స్టర్' ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.