...
...
Next Story

Salman Khan: రూ.3.50 కోట్లకు ఫ్లాట్ అమ్మేసిన సల్మాన్ ఖాన్-ఐకానిక్ గెలాక్సీని వదిలి ఆ కొత్త హై సెక్యూరిటీ కోటలోకి ఎందుకు?

Salman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముంబై బాంద్రా వెస్ట్‌లోని తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను రూ.3.50 కోట్లకు విక్రయించాడు. అయితే, సల్మాన్ ఖాన్ వరుసగా తన పాత ఫ్లాట్లను వదిలించుకుంటూ, చింబై ప్రాంతంలో ఒక సరికొత్త ప్రైవేట్ రెసిడెన్షియల్ టవర్‌ను నిర్మించడం హాట్ టాపిక్ గా మారింది.

Published on: Jul 11, 2026, 18:48:09 IST
Advertisement

Salman Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్స్ ఆస్తులు కొనడం, అమ్మడం ఒక సాధారణ విషయమే. అయినప్పటికీ సల్మాన్ ఖాన్ (Salman Khan) రియల్ ఎస్టేట్ డీల్స్ ఎప్పుడూ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా ఈ కండల వీరుడు ముంబైలోని అత్యంత విలాసవంతమైన బాంద్రా వెస్ట్ (Bandra West)లోని ఒక అపార్ట్‌మెంట్‌ను అమ్మేశాడు.

2015 ఇన్వెస్ట్‌మెంట్‌పై లాభం ఎంత?

రూ.3.50 కోట్లకు ఫ్లాట్ అమ్మేసిన సల్మాన్ ఖాన్-ఐకానిక్ గెలాక్సీని వదిలి ఆ కొత్త హై సెక్యూరిటీ కోటలోకి ఎందుకు? (PTI)
రూ.3.50 కోట్లకు ఫ్లాట్ అమ్మేసిన సల్మాన్ ఖాన్-ఐకానిక్ గెలాక్సీని వదిలి ఆ కొత్త హై సెక్యూరిటీ కోటలోకి ఎందుకు? (PTI)

సిఆర్ఇ మాట్రిక్స్ (CRE Matrix) సేకరించిన పత్రాల ప్రకారం.. బాంద్రా వెస్ట్‌లోని ‘శివ్-ఆస్థాన్ హైట్స్’ బిల్డింగ్‌లో ఉన్న ఈ ఫ్లాట్‌ను సల్మాన్ ఖాన్ జూలై 9, 2026న అధికారికంగా రిజిస్టర్ చేశాడు.

  • కొన్న ధర: 2015లో ఈ అపార్ట్‌మెంట్‌ను సల్మాన్ రూ.2.88 కోట్లకు కొనుగోలు చేశాడు.
  • అమ్మిన ధర: ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం దీనిని రూ.3.50 కోట్లకు విక్రయించాడు. (అంటే చదరపు అడుగుకు దాదాపు రూ. 46,000 చొప్పున డీల్ కుదిరింది).
  • ఖర్చులు: ఈ లావాదేవీ కోసం కొనుగోలుదారులు (దాందావాలా ఫ్యామిలీ) రూ.21 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ 758 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఫ్లాట్‌తో పాటు రెండు కార్ పార్కింగ్ స్లాట్లు కూడా ఉన్నాయి.

అసలు వ్యూహం ఏంటి?

సల్మాన్ ఖాన్ ఆస్తుల హిస్టరీని గమనిస్తే.. గత ఏడాది (జూలై 2025) లో కూడా ఇదే శివ్ ఆస్థాన్ హైట్స్ బిల్డింగ్‌లో ఉన్న తన మరొక 1,318 చదరపు అడుగుల పెద్ద అపార్ట్‌మెంట్‌ను రూ. 5.35 కోట్లకు అమ్మేశాడు. ఒకవైపు పాత ఫ్లాట్లను విక్రయిస్తూనే, మరోవైపు జూన్ 2026లో ఆయన ఒక క్రేజీ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపాడు.

ప్రైవేట్ టవర్

ఈ కొత్త నివాసం ఒక నిశ్శబ్దమైన సందులో ఉండటమే కాకుండా.. చుట్టుపక్కల భవనాల నుండి ఎలాంటి నిఘా లేకుండా, అత్యంత కఠినమైన హై-లెవెల్ ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. 1974 నుండి సల్మాన్ తన కుటుంబంతో కలిసి ఉంటున్న ఐకానిక్ ‘గెలాక్సీ అపార్ట్‌మెంట్స్’కు ఇది కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది.

బాలీవుడ్ హార్ట్ ‘బాంద్రా వెస్ట్’

బాంద్రా వెస్ట్ ముఖ్యంగా పాలి హిల్, కార్టర్ రోడ్, బ్యాండ్‌స్టాండ్ ప్రాంతాలు బాలీవుడ్ ఎలైట్ క్లబ్‌కు కేరాఫ్ అడ్రస్. షారుఖ్ ఖాన్ (మన్నత్), అమీర్ ఖాన్, సంజయ్ దత్, రేఖ వంటి లెజెండ్స్ అందరూ ఇక్కడే నివసిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe