Salman Khan: జైల్లో నరకం చూశా.. ఒక సెల్‌లో 70 మంది.. ఒకటే బాత్‌రూమ్.. ఎటు చూసినా మురికి, బల్లులు: సల్మాన్ ఖాన్ ఎమోషనల్
Salman Khan: సల్మాన్ ఖాన్ తన జైలు జీవితం గురించి తాజాగా ఓ రియాల్టీ షోలో వెల్లడించాడు. ఒకే సెల్ లో 70 మంది ఉండేవారని, బాత్‌రూమ్ దారుణంగా ఉండేదని, ఎక్కడ చూసినా బల్లులు కనిపించేవని అన్నాడు.
Salman Khan: బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టమైన రోజులను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెలికాస్ట్ అవుతున్న పాపులర్ రియాలిటీ షో 'అలయన్స్' (Alliance) సెట్స్‌లో తన సోదరుడు సోహైల్ ఖాన్ కోసం అడుగుపెట్టిన సల్మాన్.. జైలు గోడల మధ్య తాను అనుభవించిన దారుణమైన పరిస్థితులపై సంచలన కామెంట్స్ చేశారు.

కటకటాల వెనుక తాను ఎదుర్కొన్న నరకం గురించి సల్మాన్ చెప్పిన విషయాలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఒకే గదిలో 70 మంది ఖైదీలు.. బల్లులు, అసహ్యకరమైన వాతావరణం
రియాలిటీ షో ప్రోమోలో సల్మాన్ ఖాన్ తన పాత జైలు జీవితం గురించి మాట్లాడుతూ అక్కడ వాతావరణం ఎంత దారుణంగా ఉండేదో వివరించారు. కటకటాల వెనుక ఓ చిన్న గదిలో 50 నుంచి 70 మంది ఖైదీలను ఒకేసారి ఉంచేవారని తెలిపారు. అందరికీ కలిపి కేవలం ఒకే ఒక్క ఇండియన్ స్టైల్ టాయిలెట్ మాత్రమే ఉండేదని, అక్కడ చుట్టూ బల్లులు, తీవ్రమైన దుర్గంధం ఉండేదని చెప్పారు.
తాను జైల్లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఈ పరిస్థితులను సల్మాన్ వివరించడంతో షోలోని కంటెస్టెంట్స్‌తో పాటు సోహైల్ ఖాన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
4 సార్లు జైలు శిక్ష.. తల ఎత్తుకునే వెళ్లివచ్చా
1998 నాటి కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు దాదాపు నాలుగు వేర్వేరు సందర్భాల్లో సుమారు 18 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా సల్మాన్ మాట్లాడుతూ.. తాను ఏ తప్పూ చేయలేదని తన మనస్సాక్షికి తెలుసని, అందుకే ప్రశాంతంగా, తల ఎత్తుకునే జైలుకి వెళ్లి వచ్చానని స్పష్టం చేశారు.
కేవలం అక్కడ ఉండే అపరిశుభ్రమైన బాత్‌రూమ్‌లు తప్ప వేరే ఏ విషయానికీ తాను భయపడలేదని ఆయన గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
'అలయన్స్' షోలో సోహైల్ ఖాన్ ఎమోషనల్ సీక్రెట్
నటుడు కునాల్ ఖేము వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అలయన్స్' రియాలిటీ షోలో బాలీవుడ్, డిజిటల్, స్పోర్ట్స్ స్టార్స్ పాల్గొని తమ శారీరక, మానసిక సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు. ఈ షోలోనే సోహైల్ ఖాన్ కూడా ఇటీవల ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.
చిన్నతనంలో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేక ఏళ్ల తరబడి తీవ్రమైన మానసిక వేదన అనుభవించానని, పెద్దయ్యాక తన తండ్రి సలీమ్ ఖాన్‌తో పంచుకున్నానని సోహైల్ చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
సోదరుడికి ధైర్యం చెప్పేందుకు సల్మాన్ గ్రాండ్ ఎంట్రీ
షోలో కష్టమైన వారం ఎదుర్కొన్న సోహైల్‌కి ధైర్యం చెప్పేందుకే సల్మాన్ ఖాన్ ఈ వేదికపైకి వచ్చారు. అన్నను చూసిన వెంటనే సోహైల్ తో పాటు ఇంట్లోని సభ్యులందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సల్మాన్ ఖాన్ చెప్పిన నిజాలు అభిమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


