Salman Khan: రాఖీ పండుగ వేళ బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తన చెల్లెలు అర్పితా ఖాన్ శర్మతో జరుపుకున్న రక్షా బంధన్ వేడుకల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఫొటోగ్రాఫర్ల ముందు తన చేతికి ఉన్న రాఖీలను గర్వంగా చూపించిన సల్మాన్.. కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే ఈ వీడియోలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన అసలు విషయం వెనుక ఉన్న ఒక ఫొటోనే.
"మోస్ట్ సెక్యులర్ వీడియో".. సోషల్ మీడియాలో వైరల్ టాపిక్

అర్పితా ఖాన్ పోస్ట్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో.. ఆమె సల్మాన్‌కు హారతి ఇచ్చి మురిపెంగా రాఖీ కడుతుండగా భాయిజాన్ నవ్వుతూ కనిపించారు. అయితే వారి వెనుక గోడపై ఏసుక్రీస్తు లాస్ట్ సప్పర్ (The Last Supper) పెయింటింగ్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఎక్స్, రెడిట్‌లలో విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. "ఒక ముస్లిం అమ్మాయి (అర్పితా), హిందూ భర్తను (ఆయుష్ శర్మ) పెళ్లి చేసుకుని, తన ముస్లిం సోదరుడికి (సల్మాన్) రాఖీ కడుతుంటే, వెనుక ఏసుక్రీస్తు ఫొటో ఉండటం ఈరోజు ఇంటర్నెట్‌లో చూసిన అత్యంత సెక్యులర్ వీడియో" అంటూ ఒక నెటిజన్ రాసుకొచ్చారు.
గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో పండుగల సందడి
సల్మాన్ ఖాన్ ఇంట్లో ప్రతి ఏటా గణేష్ చతుర్థి, ఈద్, దీపావళి, రాఖీ వేడుకలు చాలా గ్రాండ్‌గా జరుగుతుంటాయి. ఈసారి కూడా అర్పిత కుమార్తె ఆయత్ తన అన్నలు అర్హాన్ ఖాన్, నిర్వాణ్ ఖాన్, అయాన్ అగ్నిహోత్రిలకు రాఖీలు కట్టి సందడి చేసింది.
ఖాన్ ఫ్యామిలీలో సల్మాన్, అర్బాజ్, సోహైల్, అల్విరా, అర్పితా అని ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. ఎంత ఎదిగినా ఈ ఫ్యామిలీ బాండింగ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని, మతాలకు అతీతంగా వీళ్లు జరుపుకునే పండుగలు భారత్ సమగ్రతకు నిదర్శనమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
సౌదీ మూవీ నుంచి 'మాతృభూమి' వరకు.. సల్మాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్
సల్మాన్ ఖాన్ రీసెంట్గా హాలీవుడ్ స్టార్ మోనికా బెలూచితో కలిసి నటించిన '7 డాగ్స్' అనే సౌదీ ప్రొడక్షన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన లైనప్‌లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.
{{/usCountry}}సల్మాన్ ఖాన్ రీసెంట్గా హాలీవుడ్ స్టార్ మోనికా బెలూచితో కలిసి నటించిన '7 డాగ్స్' అనే సౌదీ ప్రొడక్షన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన లైనప్‌లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.
{{/usCountry}}దర్శకుడు అపూర్వ లఖియా డైరెక్షన్ లో 'మాతృభూమి' అనే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో సల్మాన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన చిత్రంగద సింగ్ నటిస్తుండగా, త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.
ఇక ఇదే కాకుండా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నయనతారతోనూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది రంజాన్ కు రిలీజ్ కానుంది.
అర్పితా ఖాన్ ఎవరు?
అర్పితా ఖాన్ సల్మాన్ ఖాన్ సొంత చెల్లెలు కాదు. ఆమెను సల్మాన్ దత్తత తీసుకున్నాడు. సల్మాన్ తండ్రి, స్క్రీన్ రైటర్ అయిన సలీమ్ ఖాన్, నటి హెలెన్ కూతురు ఈ అర్పిత. ఆమెను చిన్నతనంలోనే సల్మాన్ దత్తత తీసుకున్నాడు. 2014లో మన హైదరాబాద్ లోని ఫలక్‌నుమా ప్యాలెస్ లోనే అంగరంగ వైభవంగా ఆమె పెళ్లి చేశాడు సల్మాన్.