Salman Khan: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. తాజాగా ఆయన సోదరుడు సోహైల్ ఖాన్ నివాసంలో జరిగిన గణపతి విసర్జన కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
సల్మాన్ ఖాన్ హారతి

సల్మాన్ ఖాన్ ఈ సందర్బంగా గణేషుడికి హారతినిచ్చారు. కానీ పూజ సమయంలో సల్మాన్ ఖాన్ వినాయకుడికి హారతి ఇస్తుండగా.. అది తప్పుడు దిశలో (ఉల్టా ఆరతి) ఇస్తున్నట్లు చెల్లెలు అర్పిత ఖాన్ గమనించారు. పెద్దగా మంత్రోచ్ఛారణలు వస్తుండటంతో సల్మాన్ ఖాన్ ను గట్టిగా పిలిచి.. హారతిని ఎలా తిప్పాలో ఆమె చేయి పట్టి చూపించారు.
గర్ల్‌ఫ్రెండ్ కూడా
ఈ సంఘటనకు సల్మాన్ ఇచ్చిన క్యూట్ రియాక్షన్ వైరల్ అవుతోంది. ఆ తర్వాత తన మేనకోడలు ఆయత్ కు సరైన పద్ధతిని వివరించడం కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకకు సల్మాన్ రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ ఇయులియా వంతూర్ (Iulia Vantur) కూడా హాజరయ్యారు.
ఈ వేడుకలో సల్మాన్ తన సవతి తల్లి హెలెన్‌తో సరదాగా ముచ్చటించడం, మీడియా ప్రతినిధులతో మాట్లాడటం నెటిజన్లను ఆకట్టుకుంది.
సల్మాన్ సినిమాలు
మరోవైపు సల్మాన్ ఖాన్ అప్‌కమింగ్ ప్రాజెక్టులపై కూడా పరిశ్రమలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అపూర్వ లఖియా దర్శకత్వంలో వస్తున్న 'మాతృభూమి' (Maatrubhumi) చిత్రంలో ఆయన చిత్రంగద సింగ్‌తో కలిసి నటిస్తున్నారు.
గతంలో 'బాటిల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రం చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ విమర్శలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పేరు మార్చుకుని రీషూట్లు జరుపుకుంటోంది.
దిల్ రాజు ప్రొడక్షన్ లో
{{/usCountry}}గతంలో 'బాటిల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రం చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ విమర్శలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పేరు మార్చుకుని రీషూట్లు జరుపుకుంటోంది.
దిల్ రాజు ప్రొడక్షన్ లో
{{/usCountry}}ఇది కాకుండా దిల్ రాజు నిర్మాణంలో సల్మాన్ మరో మూవీ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. ఈ భారీ సినిమాను ఈద్ 2027 కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
బిగ్ బాస్ 20
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్ హిందీ 20వ సీజన్ కు హోస్ట్ గానూ కొనసాగుతున్నాడు. రీసెంట్ గా వీకెండ్ ఎపిసోడ్లో తన స్టైల్లో కంటెస్టెంట్లకు చురకలు అంటించాడు సల్మాన్. ఈ బిగ్ బాస్ సీజన్ కోసం సల్మాన్ ఏకంగా రూ.200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. మరోవైపు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఒకేసారి బిగ్ బాస్ కొత్త సీజన్లు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.