Salman Khan: దేశవ్యాప్తంగా రగులుతున్న నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుగ్రామ్ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను తక్షణమే దీక్ష విరమించాలని సల్మాన్ విజ్ఞప్తి చేశారు. "ఇక చాలు బ్రో.. మా ఇంటి నుంచి నీకు కడుపునిండా తిండి పంపిస్తా" అంటూ భాయ్‌జాన్ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
"ఇంటికి వెళ్లిపోండి పిల్లలు!" - సల్మాన్ ఖాన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

విద్యార్థుల భవిష్యత్తు కోసం దేశంలోని యువత అంతా ఒక్కటి కావడం సంతోషకరమైన విషయమే అని నిన్న వ్యాఖ్యానించిన సల్మాన్.. ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెప్పారు. ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగినందున విద్యార్థులు ఇక ఆందోళన చెందకుండా తమ ఇళ్లకు వెళ్లాలని కోరారు.
సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ వేదికగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒక స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. దేశంలో విద్యార్థుల భద్రత, చదువు మాత్రమే ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ అని ఆయన పేర్కొన్నారు. పిల్లలు ఆందోళన చెందుతూ తమ కన్నవారిని భయాందోళనలకు గురిచేయకూడదని సూచించారు.
"మన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుందని నాకు నమ్మకం ఉంది. అందుకే విద్యార్థులందరూ వెంటనే నిరసనలు ఆపి ప్రశాంతంగా తమ ఇళ్లకు, తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని కోరుతున్నాను" అని సల్మాన్ రాసుకొచ్చారు.
సోనమ్ వాంగ్‌చుక్‌కి స్పెషల్ రెక్వెస్ట్
సుదీర్ఘంగా దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ని ఉద్దేశించి సల్మాన్ ఎమోషనల్ అయ్యారు. "సోనమ్.. ఇక చాలు బ్రో! ఈ దీక్షను ఇంతటితో ఆపేయ్. రాబోయే రోజుల్లో అవసరమైతే ఈ పోరాట స్ఫూర్తిని మళ్లీ చూపిద్దాం. వెంటనే ఏదైనా తిను. నీకు కావాలంటే మా ఇంటి నుంచే రుచికరమైన ఫుడ్ పంపిస్తాను" అంటూ సల్మాన్ ఆఫర్ ఇచ్చారు.
ఆస్పత్రి బెడ్ నుంచే పోరాటం.. అసలు ఏం జరిగింది?
లడఖ్‌కు చెందిన ప్రసిద్ధ పర్యావరణ, సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఈ పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
{{/usCountry}}లడఖ్‌కు చెందిన ప్రసిద్ధ పర్యావరణ, సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఈ పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
{{/usCountry}}అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు ముందుగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి బెడ్ మీద నుంచే సోనమ్ తన దీక్షను కొనసాగించడం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. దాదాపు 65 మంది ఎంపీలు సంతకాలు చేసిన లేఖతో పాటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆయనను కలిసి దీక్ష విరమించాలని కోరారు.
ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు!
ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (జులై 23) అఫీషియల్ ఎక్స్ వేదికగా స్పందించారు. పేపర్ లీకులకు పాల్పడే నేరస్థులను అత్యంత వేగంగా శిక్షించేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. దేశ యువత భవిష్యత్తు కంటే మరేదీ ఎక్కువ కాదని, బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ ఇచ్చిన ఈ హామీ తర్వాతే సల్మాన్ ఖాన్ సోనమ్ వాంగ్‌చుక్‌కి, విద్యార్థులకు ఆందోళన విరమించమని విజ్ఞప్తి చేశారు. సామాజిక అంశాలపై సల్మాన్ రియాక్ట్ అయిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.