...
...
Next Story

Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, నయనతార మూవీ రిలీజ్ ఆరోజే.. మళ్లీ ఈద్ 2027 రేసులో స్టార్ హీరో.. వీడియో రిలీజ్

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీ వచ్చే ఏడాది ఈద్ పై కన్నేసింది. లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి సల్మాన్ చేయబోయే ఈ కొత్త సినిమా అప్‌డేట్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

Published on: Apr 24, 2026, 13:20:12 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు, బాక్సాఫీస్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ అంటేనే రికార్డుల వేట. ముఖ్యంగా 'ఈద్' పండుగ వచ్చిందంటే థియేటర్ల వద్ద సల్మాన్ మేనియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొంతకాలంగా సరైన సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సల్మాన్.. ఇప్పుడు తన మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో తన ఈద్ (రంజాన్)కు తిరిగి వచ్చేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఏడాది ఈద్ కానుకగా సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీ రిలీజ్ కానుంది.

టాలీవుడ్ దర్శకుడితో క్రేజీ కాంబో..

Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, నయనతార మూవీ రిలీజ్ ఆరోజే.. మళ్లీ ఈద్ 2027 రేసులో స్టార్ హీరో.. వీడియో రిలీజ్
Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, నయనతార మూవీ రిలీజ్ ఆరోజే.. మళ్లీ ఈద్ 2027 రేసులో స్టార్ హీరో.. వీడియో రిలీజ్

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీని ఈ మధ్యే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా.. నయనతార ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ విండో వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా సల్మాన్, నయనతార, వంశీ పైడిపల్లి రావడం ఈ వీడియోలో చూడొచ్చు. వీడియో చివర్లో సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి ఫిల్మ్ ఈద్ 2027 అని అనౌన్స్ చేశారు.

'బృందావనం', 'ఎవడు', 'మహర్షి' వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వంశీ.. చివరిగా దళపతి విజయ్‌తో 'వారసుడు' (Varisu) తీసి భారీ విజయాన్ని అందుకున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ఎమోషన్స్‌తో జోడించి చెప్పడంలో వంశీ సిద్ధహస్తుడు. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా బాలీవుడ్ తెరపై చూపించబోతున్నారు. సౌత్ దర్శకులు ప్రస్తుతం బాలీవుడ్‌లో సృష్టిస్తున్న ప్రభంజనాన్ని చూస్తుంటే.. వంశీ - సల్మాన్ కలయికలో రాబోయే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

జతకట్టనున్న లేడీ సూపర్ స్టార్..

వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. యాక్షన్, రొమాన్స్ కలగలిసిన ఈ కథలో నయనతార పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

సల్లూ భాయ్ ఈద్ సెంటిమెంట్‌

సల్మాన్ ఖాన్ కెరీర్‌లో 'వాంటెడ్', 'దబంగ్', 'భజరంగీ భాయిజాన్', 'సుల్తాన్' వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలన్నీ ఈద్ పండుగ రోజే విడుదలయ్యాయి. అందుకే ఈ సీజన్‌ను సల్మాన్ తన అడ్డాగా భావిస్తారు. గతేడాది సికిందర్ మూవీతో వచ్చినా అది నిరాశ పరిచింది. ఈ ఏడాది మాతృభూమి మూవీతో ఈద్ కు వస్తాడని భావించినా అది కుదరలేదు. దీంతో వచ్చే ఏడాది వంశీ పైడిపల్లి మూవీపై సల్మాన్ ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా దర్శకుడు ఎవరు?

ఈ చిత్రానికి తెలుగు పాపులర్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇది బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్.

2. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి సినిమాలో హీరోయిన్ ఎవరు?

లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన కథానాయికగా నటిస్తున్నారు.

3. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

ఈ చిత్రాన్ని 2027 ఈద్ పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe