...
...
Next Story

సమంత రెండో పెళ్లి జరిగిందిలా.. అతిథులకు ఇచ్చిన గిఫ్ల్ లు ఇవే.. సామ్ ఫ్రెండ్ పోస్ట్ వైరల్

సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమూరు వివాహం డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహం ఎలా జరిగింది? అతిథులకు ఇచ్చిన గిఫ్ట్ లు ఏంటీ? అనే విషయాలను సమంత ఫ్రెండ్ సోషల్ మీడియాలో పంచుకుంది.

Published on: Dec 2, 2025, 09:53:34 IST
Advertisement

నటి సమంత రూత్ ప్రభు, సినీ నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమూరు డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో వివాహంతో ఒక్కటయ్యారు. సమంత రెండో పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ఆమె వివాహ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ పెళ్లి ఎలా జరిగింది? పెళ్లికి వచ్చిన అతిథులకు ఇచ్చిన గిఫ్ట్ లు ఏంటీ? అనే విషయాన్ని సమంత ఫ్రెండ్ శిల్పా రెడ్డి పంచుకుంది.

సమంత పెళ్లి

రాజ్ నిడిమోరుతో సమంత రెండో పెళ్లి
రాజ్ నిడిమోరుతో సమంత రెండో పెళ్లి

సమంత ఫ్రెండ్ శిల్పా రెడ్డి ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తూ మరిన్ని వివరాలను అందించింది. శిల్పా పంచుకున్న ఓ చిత్రంలో సమంత తన వివాహ దుస్తులలో రాజ్ పక్కన కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ కనిపించారు. వాళ్లు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ జోడీ స్పెషల్ గా నిలిచింది.

మ్యారేజీ గిఫ్ట్ లు

సమంత, రాజ్ నిడిమోరు పెళ్లికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వచ్చిన వాళ్లకు ఈ దంపతులు గిఫ్ట్ లు అందించారు. ఈ గిఫ్ట్ సంబంధించిన వీడియో కూడా శిల్పా పోస్ట్ లో ఉంది. ఇందులో ఈషా పూల నుండి తయారు చేసిన అగరబత్తులు, సద్గురువు సందేశం, భారతదేశంలో తయారైన చాక్లెట్ బార్లు, సమంత ఎంచుకున్న సీక్రెట్ ఆల్కెమిస్ట్ బ్రాండ్ పెర్ఫ్యూమ్ ఉన్నాయి.

Shilpa via Instagram Stories.

భూత శుద్ధి వివాహం

ఈ పిక్ వైరల్

సమంత పక్కన కూర్చుని నవ్వుతూ ఆమె చేయి పట్టుకున్న తన చిత్రాన్ని కూడా శిల్పా పోస్ట్ చేసింది. సమంత పక్కనే రాజ్ కూర్చున్నాడు. వధూవరులు ఇద్దరూ ఒకరికొకరు పూల దండలు వేసుకున్నారు. ఈ పిక్ వైరల్ గా మారింది.

'సామ్, రాజ్ ల అందమైన భూత శుద్ధి వివాహం ఈషా ఫౌండేషన్ లో జరిగింది. ఎరుపు అంచుతో కూడిన ఆకుపచ్చ రంగులో ఉన్న సింపుల్, అందమైన కాంచీ కాటన్ చేనేత చీరను ధరించా. దానికి సౌత్ ఇండియా, టెంపుల్ జ్యువెలరీని యాడ్ చేశా’’ అని శిల్పా పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks